Agent – Liger : భారీ హైప్ మధ్య విడుదలై అట్టర్ ప్లాప్ అయిన చిత్రాలుగా ఏజెంట్, లైగర్ నిలిచాయి. ఈ రెండు చిత్రాల మీద ఆడియన్స్ అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. ఫలితం మాత్రం ఘోరంగా వచ్చింది. లైగర్ మూవీ విజయ్ దేవరకొండ లైఫ్ నే మార్చేస్తుందని అందరూ భావించారు. బాలీవుడ్ లో లైగర్ మూవీ మీద బజ్ ఏర్పడింది. లైగర్ విజయం సాధిస్తా విజయ్ దేవరకొండ టాప్ స్టార్స్ లిస్ట్ లోకి చేరేవాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ డబుల్ డిజాస్టర్ అయ్యింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన లైగర్ నెగిటివ్ టాక్ తో నెక్స్ట్ డే నుండి చతికల పడింది.