Ram Charan And NTR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR మూవీ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన క్రేజ్ ఏర్పడింది..ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల నటనకి ముగ్దులు కానీ ప్రేక్షకుడు అంటూ ఎవ్వరు లేరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ని సరిగ్గా వాడుకోవాలని చూస్తున్నారు ఇరువురి హీరోలు..ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ అమ్రిత్సర్ లో విరామం లేకుండా గత వారం రోజుల నుండి జరుగుతుంది..ఇక ఎన్టీఆర్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఒక్క మూవీ చెయ్యబోతున్నాడు..ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుంది..అయితే వీళ్లిద్దరు #RRR తర్వాత ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్స్ గురించి సోషల్ మీడియా లో ఒక్క వార్త తెగ వైరల్ గా మారింది.
#RRR సినిమాకి ముందు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి దాదాపుగా 35 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు..అయితే #RRR తర్వాత ఆయన చెయ్యబోతున్న కొరటాల శివ సినిమాకి 70 రోజుల కాల్ షీట్స్ కోసం 55 కోట్ల రూపాయిల పారితోషికం ని డిమాండ్ చేసాడు అట ఎన్టీఆర్..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడం తో ఆయన పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఈ సినిమాకి ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ ఒక్క సినిమాకి గాను నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ కి సుమారు 100 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకుంటున్నట్టు గత కొద్దీ రోజుల నుండి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న హాట్ టాపిక్..ప్రభాస్ టారెట్ ఇండియా లో 100 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి రామ్ చరణ్ మాత్రమే ఎదిగాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
Also Read: Raashi khanna: స్టార్ హీరో సినిమాలో ప్లాప్ హీరోయిన్ ?
ఒక్కే సినిమాలో నటించిన ఇద్దరి స్టార్ హీరోల తర్వాతి సినిమాకి పారితోషికాలలో ఇంత తేడా అని మీకు సందేహం రావొచ్చు..కానీ వాస్తవం ఏమిటి అంటే ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో రామ్ చరణ్ రేంజ్ క్రేజ్ లేదు అనే చెప్పాలి..ఎందుకంటే 2009 వ సంవత్సరం లో వచ్చిన మగధీర సినిమా తమిళ్ మరియు మలయాళం వంటి ఇండస్ట్రీస్ లో సంచలన విజయం సాధించాయి..ఆ తర్వాత విడుదల అయిన రామ్ చరణ్ సినిమాలు కొన్ని ఆ బాషలలో మంచి విజయాలు గా నమోదు చేసుకున్నాయి..దీనితో రామ్ చరణ్ అక్కడి జనాలకు బాగా దగ్గర అయ్యాడు..ఇక బాలీవుడ్ లో కూడా మగధీర సినిమాని ఎగబడి మరి చూసారు..అప్పటి నుండే రామ్ చరణ్ ఇక్కడ మంచి పాపులర్..ఇక #RRR సినిమా తో ఆయన పాపులారిటీ ఇతర రాష్ట్రాల్లో తార స్థాయికి చేరుకుంది..అన్ని బాషలలో మార్కెట్ ఉన్న హీరో కాబట్టే రామ్ చరణ్ కి అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న టాక్.
Also Read: YS Sharmila: పాదయాత్ర చాలు.. అమెరికా వెళ్దాం.. షర్మిలమ్మను ఎవరూ పట్టించుకోరే..!
Recommended Videos: