https://oktelugu.com/

Prabhas and Rajinikanth : ప్రభాస్, రజినీకాంత్ తర్వాత రామ్ చరణే..ఫ్లాప్ టాక్ తో 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన మొనగాళ్లు!

ఒక ఫ్లాప్ సినిమా తగిలినప్పుడే స్టార్ హీరో స్టామినా ఏమిటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే సూపర్ హిట్ టాక్ మీద ఎవరైనా భారీ వసూళ్లను సాధిస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 03:48 PM IST

    Prabhas , Rajinikanth , Ram Charane

    Follow us on

    Prabhas and Rajinikanth : ఒక ఫ్లాప్ సినిమా తగిలినప్పుడే స్టార్ హీరో స్టామినా ఏమిటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే సూపర్ హిట్ టాక్ మీద ఎవరైనా భారీ వసూళ్లను సాధిస్తారు. ఈమధ్య కాలం ఊరు పేరు తెలియని హీరోలు కూడా వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. కానీ ఫ్లాప్ టాక్ వస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా మొదటి రోజు మ్యాట్నీ షోస్ కే దారుణంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఇలాంటి ట్రెండ్ ఉన్న రోజుల్లో ఫ్లాప్ సినిమాకి మినిమం గ్యారంటీ వసూళ్లు రప్పించే వాళ్ళే నిజమైన సూపర్ స్టార్స్. రామ్ చరణ్ ఇప్పుడు ఆ క్యాటగిరీ కి చెందిన హీరోనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.

    #RRR తర్వాత రామ్ చరణ్ తన ప్రైమ్ టైం లో మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి చేసిన సినిమా ఇది. అభిమానులు ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అలా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే బెనిఫిట్ షోస్ నుండే టాక్ రాలేదు. ఇక అభిమానుల పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ థియేటర్స్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ ఈలలు వేసి, చప్పట్లు కొట్టే సన్నివేశం ఒక్కటి కూడా లేదు. రామ్ చరణ్ లాంటి ఊర నాటు మాస్ హీరో ని పెట్టుకొని డైరెక్టర్ శంకర్ ఇంత సింపుల్ ఫ్లాట్ సబ్జెక్టు ని ఎలా ఎంచుకున్నాడో అని విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. ఇలా ఎన్నో ట్రోల్స్ పీక్ నెగటివిటీ మధ్య విడుదలైన ఈ చిత్రం నిన్నటితో వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది.

    రంగస్థలం, #RRR చిత్రాల తర్వాత రామ్ చరణ్ కి ఇది మూడవ వంద కోట్ల షేర్ సినిమా. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 190 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ఈ వీకెండ్ తో 200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరనుంది. ఘోరమైన డిజాస్టర్ టాక్ తో ఈ ఎలైట్ క్లబ్ లోకి ఇప్పటి వరకు కేవలం ప్రభాస్, రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ మాత్రమే చేరారు. ప్రభాస్ నటించిన సాహూ, ఆదిపురుష్ వంటి చిత్రాలు డిజాస్టర్ టాక్స్ తో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వాళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ తో రామ్ చరణ్ ఆ లిస్ట్ లోకి చేరాడు. డిజాస్టర్ టాక్ తోనే ఈ రేంజ్ వసూళ్లు అంటే, ఇక సూపర్ హిట్ టాక్ వచ్చి ఉండుంటే ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి.