https://oktelugu.com/

Vikramarkudu: విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ మందుకు బానిస అయ్యాడా..? అలా మారడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు…

ఇండస్ట్రీలో చాలామంది నటులు స్టార్ హీరోలుగా మారుతున్నారు. అయితే పాన్ ఇండియా నేపధ్యంలో వస్తున్న సినిమాలకి ఎక్కువగా రీచ్ అయితే ఉంటుంది. అలాగే ఆ సినిమాలు భారీ కలెక్షన్స్ ని సాధించడానికి అవకాశాలు కూడా ఉంటున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన సమయంలో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 03:46 PM IST

    Vikramarkudu

    Follow us on

    Vikramarkudu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికి ఇకమీదట వీళ్ళు చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అశోక్ దేవా అనే నటుడు ఇప్పుడు మద్యం తాగుతూ కృష్ణ నగర్ వీధుల్లో ఖాళీగా తిరుగుతున్నాడు… ఇక విక్రమార్కుడు సినిమాలో క్రికెట్ ఆడుతూ బాల్ లోపలికి కొట్టిన తర్వాత ఏ సత్తి బాల్ వచ్చిందా అంటూ అడిగే ఒక డైలాగ్ అయితే చెబుతాడు. ఇక ఇప్పటివరకు ఆ డైలాగ్ చాలా బాగా ఫేమస్ అయింది.

    ఇక ఆ నటుడు ప్రస్తుతం కృష్ణానగర్ వీధుల్లో ఖాళీగా తిరుగుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన 52 సినిమాల వరకు చేశాడు. అయినప్పటికీ అతనికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. మరి ఇప్పటికైనా ఆయన మంచి ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ సినిమా అవకాశాల కోసం తిరిగితే మంచి ఆఫర్స్ అయితే వస్తాయి.

    Vikramarkudu(1)

    ఇక ఇప్పటికే చాలామంది అతనికి సలహాలు ఇచ్చినప్పటికి ఆయన మాత్రం సినిమాలకు సెట్ అసిస్టెంట్ గా పని చేస్తూ తన రోజువారి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ తాగుడుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన అలా మారడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ అమ్మానాన్న, బామ్మ ముగ్గురు ఒకే సమయంలో చనిపోవడం వల్ల ఆయన ఆ బాధను మర్చిపోవడానికి మందుకు ఎడిక్ట్ అయినట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగాల్సిన ఒక నటుడు ఇలా మధ్యలోనే సైడ్ ట్రాక్ లొకి వెళ్లి ఇబ్బందులను పడుతుండటం చాలావరకు జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి. ఇక ఆయన ఖడ్గం, ఆంధ్రావాలా, విక్రమార్కుడు, మాస్ లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు… చూడాలి మరి ఇక మీదట ఆయనకు ఎవరైనా దర్శక నిర్మాతలు అవకాశాన్ని ఇచ్చి నటుడిగా ప్రోత్సహిస్తారా లేదా అనేది…