Brahma Anandam Teaser: కామెడీ అంటే అందరికి ముందుగా గుర్తు వచ్చేది బ్రహ్మానందం పేరే. అసలు అతను సినిమాల్లో లేకపోతే కొందరు సినిమా కూడా చూడరు. ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మా నందం తనదైన కామెడీతో సినిమాల్లో ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే బ్రహ్మా నందం కుమారుడు రాజా గౌతమ్ చాలా ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిజ జీవితంలో తండ్రీ కొడుకులు అయిన వీరిద్దరూ.. తాతా మనవళ్లుగా ప్రేక్షకుల ముందుకు కొత్త సినిమాతో రానున్నారు. బ్రహ్మా ఆనందం అనే కొత్త సినిమాతో వీరిద్దరూ వెండి తెరపై ప్రేక్షకులను అలరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. 53 సెకన్లు ఉన్న ఈ టీజర్‌లోనే కామెడీని పండించారంటే.. సినిమా మొత్తం చూస్తే ఎలా ఉంటుందో మీరు ఓసారి ఊహించుకోండి. ఈ సినిమాలో బ్రహ్మానందం రాజాగౌతమ్‌కి తాతగా నటించాడు. మనవడిని ఇరిటేట్ చేసే తాతగా అతన్ని చూపించారు. వీరిద్దరి కాంబోలో కామెడీ అదిరిపోయిందని..ఇంకా సినిమాలో పీక్స్‌లో ఉంటుందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. టీజర్ చివర్లో అతన్ని ఎందుకు భరిస్తున్నా అంటే.. మా తాత కాబట్టి అనే డైలాగ్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న స్వధార్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నాడు. ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని హీరోయిన్‌గా కనిపిస్తోంది. వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సీన్లు కూడా నవ్వులను పండించాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారని అంటున్నారు. టీజర్ అదిరిపోయిందని, సినిమా పక్కాగా హిట్ అవుతుందని అంటున్నారు. తండీ కొడుకులు తాత మనవళ్లుగా ఇలా వెండితెరపై కనిపించడం ఇదే తొలిసారి ఏమోనని కొందరు అంటున్నారు. ఇలాంటి స్టోరీతో సినిమా తీయాలనే ఆలోచన రావడం హ్యా్ట్సాఫ్ అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజా గౌతమ్ కూడా సినిమాలు చేసి చాలా ఏళ్లు అయ్యింది. 2018లో మను అనే ఒక థ్రిల్లింగ్ సినిమాలో కనిపించాడు. మళ్లీ ఈ బ్రహ్మా ఆనందం సినిమాతోనే మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. మరి ఈ బ్రహ్మానందం సినిమా టీజర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.