Trisha : సాధారణంగా ఒక సక్సెస్ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచేయడం.. ఈ విషయంలో త్రిష ఫాస్ట్ గా ఉంది. అందుకు ఉదాహరణ ఈ తాజా పరిణామాలే. 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ త్రిష దాదాపు 23 సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్నారు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు మాత్రం అడ్డంగా తన్నేశాయి. అంతేకాదు ఈమె సరైన హిట్ చూడక ఐదు సంవత్సరాలు దాటింది. 2018 తర్వాత త్రిష నటించిన ఏ సినిమా కూడా విజయవంతం కాలేదు. ఇక ఆమె పని అయిపోయింది అని ఇండస్ట్రీలో ముద్ర వేశారు.

-మణిరత్నం ఆదుకున్నాడు
ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు మణిరత్నం త్రిషను ఆదుకున్నాడు. మణి రత్నం వల్ల సక్సెస్ తో పాటు మంచి పేరు వచ్చాయి. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై గా త్రిష నటించిన పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ సినిమా తర్వాత గత కొంతకాలంగా నత్తనడకన నడుస్తున్న ఆమె కెరీర్.. జెట్ స్పీడ్ లో పరిగెడుతున్నది. భారీ అవకాశాలు త్రిష తలపుతడుతున్నాయి. ఈ బ్యూటీ ఒక్కసారిగా తన పారితోషికం పెంచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటివరకు కోటిన్నర దాటని ఆమె రెమ్యూనరేషన్న్ ను డబుల్ చేసినట్టు సినీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఈమె చేతిలో రోడ్డు అనే మూవీ ఉంది.. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో, అజిత్ సరసన మరో చిత్రంలో ఈమె కనిపించనుంది. ఇక పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కు సంబంధించి ఈమె షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా 40 ఏళ్లు వచ్చాయి.. మరి పెళ్లి ఎప్పుడు అంటే డోంట్ టాక్ అంటూ ముసిముసిగా నవ్వుతోంది ఈ చెన్నై సోయగం.