Unstoppable 2 with NBK YS Sharmila: ఎవ్వరు ఊహించని అతిథులతో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఈ టాక్ షో కి కొనసాగింపుగా రెండవ సీజన్ కూడా ఇటీవలే ప్రారంభమై మొదటి సీజన్ కంటే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇప్పటి వరుకు రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఈ వారంతో మూడవ ఎపిసోడ్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది.

మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్..రెండవ ఎపిసోడ్ కి విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ, మూడవ ఎపిసోడ్ కి శర్వానంద్ మరియు అడవి శేష్ హాజరయ్యారు..ఈ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ కి కూడా ఫలానా సెలబ్రిటీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ.. త్వరలోనే రాజకీయాల్లో ప్రకంపనలు రేపే రేంజ్ గెస్ట్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2’ ఎపిసోడ్ కి రాబోతున్నారట.
ఆ అతిథి మరెవరో కాదు దివంగత మహానేత వైఎస్ఆర్ కుమార్తె , ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి సోదరి షర్మిల ఈ టాక్ షో కి ముఖ్య అతిధి గా రాబోతున్నారట..ఆమెతో పాటుగా ఆమె తల్లి విజయమ్మ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట..ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..షర్మిల గారు ఇటీవలే తెలంగాణలో సొంతగా పార్టీ పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.. అంతే కాకుండా తన అన్నయ్య జగన్ మీద డైరెక్ట్ గా సెటైర్లు .. విమర్శలు కూడా చేసింది.
మొన్నీమధ్యనే టీడీపీ కి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ ఏబీఎన్ లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ టాక్ షో లో పాల్గొన్న షర్మిల ఇప్పుడు మరోసారి టీడీపీ పార్టీ ఎమ్యెల్యే బాలయ్య బాబు నిర్వహిస్తున్న టాక్ షో కి ముఖ్య అతిథిగా పాల్గొనబోతుండడం షాక్ కి గురి చేస్తున్న విషయం.. ఈ టాక్ షో ద్వారా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు.. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపే విధమైన వ్యాఖ్యలు ఏమైనా షర్మిల చేయబోతున్నారా లేదా అనేది చూడాలి.