https://oktelugu.com/

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ మృతితో… ఆగిన అభిమాని గుండె

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో… కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే కాకుండా… సినీ పరిశ్రమ మొత్తానికి  కూడా తీరని లోటు అని చెప్పాలి. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు. అయితే […]

Written By: , Updated On : October 30, 2021 / 10:13 AM IST
Follow us on

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణంతో… కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే కాకుండా… సినీ పరిశ్రమ మొత్తానికి  కూడా తీరని లోటు అని చెప్పాలి. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు.

after knowing puneeth raj kumar death news his fan also died due to heart attack

అయితే తన అభిమాన హీరో ఇక లేరు అనే వార్తను విని ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. పొన్నాచి తాలుకాలోని మరూరుకు చెందిన మునియప్ప కు పునీత్ అంటే చాలా ఇష్టం… పునీత్‌ను అమితంగా ఆరాధించే మునియప్పకు ఆయన లేరనే వార్త వినగానే గుండెపోటు వచ్చింది.  వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే మునియప్ప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మునియప్పకు ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది.

పునీత్ రాజ్ కుమార్ కుమార్ కుమార్తె ధృతి పునీత్ రాజ్ కుమార్ విదేశాల్లో  చదువుకుంటున్న విషయం తెలిసిందే.  కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె బెంగుళూరు చేరుకొనున్నారు. అనంతరం పునీత్ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనంగా జరిపించనున్నారు. గతంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ మరణించిన సమయంలో అభిమానులు సృష్టించిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసింది. అలానే రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యపాన నిషేధం విధించింది. ప్రస్తుతం పునీత్ మరణ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.