Celbraties Who Died Early: మన జీవితంలో మన ప్రమేయం లేకుండా జరిగేవి రెండే రెండు ఒకటి జననం, మరొకటి మరణం. ఈ రెండు విషయాలలో మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. అయితే మరణం ముందు అందరూ సమానులే అని చెప్పవచ్చు. ఇలా బ్రతికి ఉన్న రోజులు ఎంతో మంచిగా, గొప్పగా జీవించిన ఏదో ఒక రోజు మరణం ముందు తలవంచక తప్పదు. ఇలా ఎంతో మంది గొప్ప వారు సెలబ్రిటీలు అతి చిన్న వయసులోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మరణించడం ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.
ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకొని విశేష ప్రేక్షకాదరణ పొందిన హీరోహీరోయిన్లు మరణిస్తే బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సంపాదించుకొని చిన్నవయసులోనే మరణించి షాక్ ఇచ్చిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి “చిత్రం” సినిమా ద్వారా అడుగుపెట్టిన హీరో ఉదయ్ కిరణ్. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ హీరోకి అప్పట్లో లవర్ బాయ్ గా పేరు ఉండి ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఉన్నఫలంగా ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఎంతో మానసిక ఒత్తిడికి లోనైన ఉదయ్ కిరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి ఒక షాకింగ్ అని చెప్పవచ్చు.అదేవిధంగా నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం నటనతో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న దివ్యభారతి ప్రమాదవశాత్తు కింద పడి మరణించారు.
ఇక తాజాగా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అప్పు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొని, ఇలా పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నటుడిగా అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈయన మరణం కేవలం కన్నడ ఇండస్ట్రీకీ మాత్రమే కాకుండ సినిమా ప్రపంచానికి తీరని లోటని చెప్పవచ్చు.