Pawan Kalyan: ఒక రచయిత ఒక కథను రాశాడు అంటే.. వెనుక ముందు అన్నీ చూసుకుని రాస్తాడు. ఎక్కడ ఏమి ఉండాలో.. ఎక్కడ దేన్నీ హైలైట్ చేయాలో ఆ రచయిత ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకుని కథను పూర్తి చేస్తాడు. కానీ హీరోలకు ఆ కథలో ఎక్కడో ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది. దాంతో వాళ్లకు నచ్చిన విధంగా ఆ కథకు సర్జరీలు చేయిస్తూ ఉంటారు. సర్జరీ చేయించిన తర్వాత కూడా నచ్చకపోతే.. మేకప్ వేయిస్తారు.

సినిమా ఇండస్ట్రీ సగటు కథ పరిస్థితి ఇదే. ఇప్పుడు పవర్ స్టార్ కూడా కథలో మార్పులు చేర్పులు చేయిస్తూ ముందుకు పోతున్నారు. అసలు షూటింగ్ మొదలై చాన్నాళ్లయింది. నిజానికి మరికొన్ని రోజుల్లో అనగా మరో రెండు షెడ్యూల్స్ చేస్తే షూట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఈ మార్పులు ఏమిటి ? కచ్చితంగా దర్శకనిర్మాతలకు ఇది తలనొప్పే.
ఇంతకీ ఈ బాగోతం అంతా ఏ సినిమా గురించి అంటే.. భీమ్లా నాయక్ గురించే. పవన్ – రానా కలయికలో కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే షూట్ కి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో సందట్లో సడేమియా అన్నట్టు పవన్ కథలో కొన్ని మార్పులను సూచించాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు మార్పులు చెప్పి ఉంటే ఓకే. కానీ సగం షూటింగ్ అయిపోయాక స్క్రిప్ట్ లో మార్పులేమిటి ?
ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర ఉండి స్క్రిప్ట్ రాశాడు, డైరెక్టర్ చేత రాయించాడు. మరి త్రివిక్రమ్ జడ్జ్ మెంట్ మీద పవన్ కు నమ్మకం లేకుండా పోయిందా ? లేక, పవన్ లో కూడా ఒక రచయిత ఉన్నాడు కాబట్టి.. ఆ రైటర్ నిద్ర లేచాడా ? నిజానికి ఈ సినిమాలో పవర్ స్టార్ పై కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి.
Also Read: Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?
ఎమోషనల్ సీన్స్ అంటే.. శత్రువును ఏమి చేయలేక నిస్సహాయతతో బాధగా కూర్చుంటుంది పవన్ పాత్ర. పవన్ ను అలా చూసి అభిమానులు జీర్ణయించుకోలేరు కాబట్టి.. ఇప్పుడు ఆ సన్నివేశాలను పూర్తిగా మార్చాలని పవన్ సూచించారు. తన ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని పవన్ ఈ మార్పులు చెప్పాడట. పైగా తన అభిమానుల కోసం పవనే స్వయంగా కొన్ని సీన్స్ ను చెప్పాడట.
Also Read: Puneeth raj kumar Video: జిమ్ లో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వీడియో.. నిజమెంత?