https://oktelugu.com/

Deputy CM Pavan Kalyan : ఏఐ ఫొటోను చూపిస్తూ.. వరద సాయంపై అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్

ఏపీలో వరదతో ప్రజలు బాధపడుతుంటే.. రాజకీయాలు, రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు. ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేసుకొని జరుగుతున్న ప్రచారం పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జనసేనాని. ఏకంగా వైసిపి కి సవాల్ చేస్తూ కీలక కామెంట్స్ చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 5, 2024 / 03:03 PM IST

    Deputy CM Pavan Kalyan (1)

    Follow us on

    Deputy CM Pavan Kalyan : ఏపీలో మరోసారి వైసీపీకి టార్గెట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ నగరాన్ని ముంచేశాయి.సీఎం చంద్రబాబు మూడు రోజులపాటు విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం వేరు వేరు ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించారు. విపక్ష నేత జగన్ సైతం బాధితులను పరామర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది మానవ తప్పిదంగా అభివర్ణించారు. అయితే ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం ఏమిటన్న ప్రశ్నను హైలెట్ చేసింది వైసిపి. అసలు పవన్ ఇక్కడే ఉన్నారా? విదేశాలకు వెళ్లిపోయారా?అని ప్రశ్నల వర్షం కురిపించింది. మాజీ మంత్రి రోజా లాంటి వారి అయితే ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి ఇదే అంశంపై నిలదీశారు. పవన్ మంగళగిరిలో ఉంటే ఎక్కడైనా సహాయక చర్యల్లో పాల్గొనవచ్చు కదా అని వైసిపి నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని..ఇక్కడే ఉన్నానని.. అధికారులతో నిరంతర సమీక్షలు జరుపుతున్నానని చెప్పుకొచ్చారు. వరద బాధితులకు ఐదు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి సైతం కోటి రూపాయలు సాయంగా అందించారు. వరద సహాయ చర్యల్లో తాను పాల్గొంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసే తాను దూరంగా ఉన్నట్లు ప్రకటించారు పవన్. అయితే పవన్ ఇంతలా ప్రకటించిన తరువాత కూడా వైసిపి వెనక్కి తగ్గలేదు. అదేపనిగా ఆయనపై విశ్వ ప్రచారం చేస్తూనే ఉంది.

    * ప్రభుత్వ చర్యలు భేష్
    ఏపీలో వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు సీనియారిటీ అవసరానికి వచ్చిందని గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. అత్యాధునిక పరికరాలతో బాధితులకు సత్వర ఆహారం అందుతోందని పవన్ వెల్లడించారు.అందుకు సంబంధించి చిత్రాలను కూడా మీడియాకు చూపించారు. అయితే దీనిపై కూడా వైసిపి అభ్యంతరాలు తెలుపుతోంది.ఆయన చూపిస్తున్న వీడియోలు, ఫోటోలు తేడాలను చూపిస్తోంది. అవన్నీ ఫేక్ గా తేల్చుతోంది.

    * సహాయ చర్యల్లో హెలిక్యాప్టర్లు, డ్రోన్లు
    వరద సహాయ చర్యల్లో భాగంగా ఈసారి ఆరు హెలికాప్టర్లను విజయవాడ నగరంలో వినియోగించారు.వందలాది డ్రోన్లతో ఆహార పంపిణీ చేశారు. అయితే ఈ ఆహార పంపిణీ ప్రధాన ప్రాంతాలకే పరిమితం అయిందన్న విమర్శ ఉంది. మరోవైపు డ్రోన్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లలేదని.. ప్రధానంగా అపార్ట్మెంట్లకే పరిమితం అయ్యారని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనిపై పవన్ తాజాగా స్పందించారు.మారుమూల ప్రాంతాలకు,అది కూడా నాలుగు అడుగుల లోతులో నీరు ఉండగా.. ఓ బాధితురాలికి డ్రోన్ ఆహారం అందిస్తున్న ఫోటోను చూపించారు పవన్.అయితే అందులో వ్యత్యాసం ఉందని..పవన్ చెబుతున్నది నిజం కాదని.. ఆయన అడ్డంగా బుక్కయ్యారని వైసీపీ ప్రచారం చేస్తోంది.

    * అతిగా వైసిపి ప్రచారం
    అయితే భారీ వర్షాలను వైసిపి తన సొంత ప్రచారానికి వాడుకుంటుందన్న విమర్శ ఉంది. ప్రధానంగా వరదల వేళ డిప్యూటీ సీఎం పవన్ను టార్గెట్ చేసుకునే విధానం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఒక ప్లాన్ ప్రకారమే పవన్ ను వ్యూహాత్మకంగా ఇరికించే ప్రయత్నం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. అయితే దీనిపై పవన్ సవాల్ చేశారు. వైసీపీ నేతలు తన వెంట వస్తే సహాయక చర్యలపై నిజా నిజాలు చూపిస్తానని తేల్చి చెప్పారు. ఇటువంటి విమర్శలు మానుకోవాలని హి తవు పలికారు. వీలైతే వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.