Vettiyan’ Advance Bookings. : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలకు యూత్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ తమిళ టైటిల్ ని తెలుగు లో కూడా పెట్టడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో కాస్త నెగటివిటీ ఏర్పడింది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కి తెలుగు ఆడియన్స్ ఇచ్చే వసూళ్లు కావాలి కానీ, ఆయన మాత్రం తెలుగు ఆడియన్స్ కి గౌరవం ఇవ్వడా?, వట్టియాన్ అంటే అర్థం ‘వేటగాడు’. ఆ టైటిల్ పెట్టడానికి మూవీ టీం కి ఏమి అడ్డమొచ్చింది?, ఇలాగే తెలుగు సినిమా దర్శక నిర్మాతలు తెలుగు టైటిల్ తోనే తమిళం లో తమ సినిమాలను దబ్ చేసి విడుదల చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.
ఈ సినిమాని మేము చూడము, బ్యాన్ చేస్తున్నాము అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ కూడా చేసారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియా కి మాత్రమే పరిమితం అయ్యింది. బయట దీని ప్రభావం ఇసుమంత కూడా పడలేదు అనడానికి ‘వెట్టియాన్’ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. నిన్న మొన్నటి వరకు బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో వెట్టియాన్ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి చలనం లేదు. కానీ కాసేపటి నుండి ఊపు అందుకుంది. బుక్ మై షో యాప్ లో గంటకి 2 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్, వస్తే ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లో ఉంటాయని ఈ ట్రెండ్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో మొదటి రోజు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 9 కోట్ల రూపాయలకు జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది ఈ చిత్రం. ఫుల్ రన్ లో బయ్యర్స్ కి భారీ లాభాలు రావొచ్చు. సోషల్ మీడియా లో ఒకపక్క టైటిల్ విషయం లో ఇంత రగడ జరుగుతున్నప్పటికీ, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై ఏమాత్రం ప్రభావం చూపడం లేదంటే, మన తెలుగు ఆడియన్స్ కి రజినీకాంత్ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఆయన నటించిన ‘జైలర్’ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ లో 100 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంత అభిమానం చూపిస్తున్నప్పటికీ కూడా రజినీకాంత్ తెలుగు ఆడియన్స్ మీద గౌరవం చూపించకపోవడం నిజంగా శోచనీయం అని చెప్పొచ్చు.