Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ లైవ్ స్ట్రీమింగ్ వీడియోలో కనిపించని నిఖిల్.. హౌస్ నుండి బయటకి వెళ్లిపోయాడా!

ఈ టాస్కు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండడాన్ని మనం రీసెంట్ గా విడుదలైన ప్రోమోలలో చూడవచ్చు. అయితే కేవలం టీవీ లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ ని మాత్రమే చూడడం కాదు, బిగ్ బాస్ ని అమితంగా ఇష్టపడేవాళ్లు హాట్ స్టార్ లో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమింగ్ ని కచ్చితంగా చూడాల్సి ఉంటుంది. చూస్తే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి.

Written By: Vicky, Updated On : October 9, 2024 9:39 pm

bigg boss telugu 8 Nikhil

Follow us on

Bigg Boss Telugu 8 : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 ఎంత ఆసక్తికరంగా ముందుకు సాగుంతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని షో ప్రారంభం నుండి అక్కినేని నాగార్జున ఊదరగొడుతూనే ఉన్నాడు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కనిపించడం లేదని మొదట్లో ఆడియన్స్ అనుకునేవారు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత లెక్కలు మారాయి. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్కులు కూడా ఇప్పుడు ఊహించిన స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ కొనసాగుతుంది. ఈ టాస్కు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండడాన్ని మనం రీసెంట్ గా విడుదలైన ప్రోమోలలో చూడవచ్చు. అయితే కేవలం టీవీ లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ ని మాత్రమే చూడడం కాదు, బిగ్ బాస్ ని అమితంగా ఇష్టపడేవాళ్లు హాట్ స్టార్ లో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమింగ్ ని కచ్చితంగా చూడాల్సి ఉంటుంది. చూస్తే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి.

ఉదాహారానికి నేటి లైవ్ స్ట్రీమింగ్ లో జరుగుతున్న టాస్కులో నిఖిల్ కనిపించలేదు. సుమారుగా రెండు మూడు గంటల పాటు సాగిన ఈ లైవ్ లో నిఖిల్ ఎక్కడా కనిపించలేదు. దీనిని గమనించిన కొంతమంది ఆడియన్స్, నిఖిల్ ఏమయ్యాడు..?, ఏదైనా ముఖ్యమైన పని ఉండడం వల్ల బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకొని బయటకి వెళ్లాడా?, లేదా ఆడియన్స్ కళ్ళుకప్పి రహస్యంగా నిఖిల్ ని బయటకి పంపారా అనేది తెలియాల్సి ఉంది. గత సీజన్ లో కూడా శివాజీ ఇలా టాస్కు జరుగుతున్న సమయంలో మాయం అయ్యాడు. అయితే ఆయన మాయం అయ్యినట్టు మనకి టీవీ లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో కనిపించలేదు. ఇప్పుడు నిఖిల్ విషయం లో కూడా అదే జరిగింది. హౌస్ లో ఉన్న ఏ కెమెరాకి కూడా ఆయన కనిపించలేదు. అయితే ఒక్కోసారి ముఖ్యమైన సంఘటనలు హౌస్ లో జరిగినప్పుడు లైవ్ లో బిగ్ బాస్ నిర్వాహకులు కట్ చేస్తారు. గత సీజన్ చివర్లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవని లైవ్ లో ఇలాగే కట్ చేసి కేవలం టీవీ టెలికాస్ట్ లో మాత్రమే చూపించారు.

అలా ఇప్పుడు కూడా ఏదైనా జరగకూడని సంఘటన జరిగిందా అని ఆలోచిస్తున్నారు నెటిజెన్స్. మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో నిఖిల్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశం కూడా ఉండొచ్చని అంటున్నారు. సీక్రెట్ రూమ్ ని ఈ సీజన్ సిద్ధం చేసిపెట్టి చాలా రోజులు అయ్యింది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని అందులోకి పంపినప్పుడు మాత్రమే సీక్రెట్ రూమ్ సక్సెస్ అవుతుంది. నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అన్నప్పుడు హౌస్ లో అందరి మధ్య చర్చలు జరుగుతాయి, ఆ చర్చల్లో నిఖిల్ తన గురించి ఎవరు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు?, ఎవరు నెగటివ్ గా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. తెలుసుకొని లోపలకు వచ్చిన తర్వాత అసలు సిసలు ఆట ఉంటుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.