Mana Shankara Varaprasad Garu Advance bookings: మెగా(Megastar Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ‘రాజా సాబ్’ చిత్రానికి ఉన్నట్లుగానే, ఈ సినిమాకు కూడా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధర 500 రూపాయిలు మాత్రమే. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కానీ తెలంగాణ లో మాత్రం ఇప్పటి వరకు అవ్వలేదు. ముందే విడుదల చేస్తే హై కోర్టు నుండి సమస్యలు వస్తాయని భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ, ఈరోజుకు అయితే తెలంగాణ లో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ రెగ్యులర్ షోస్ కి మాత్రం బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేసారు.
ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఈ చిత్రానికి డిస్ట్రిక్ట్ యాప్ లో 69 షోస్ ని షెడ్యూల్ చేయగా, 31.5 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ 69 షోస్ కి గాను 42 వేలకు పైగా టికెట్స్ ఉండగా, అందులో 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే 36 శాతం ఆక్యుపెన్సీ అన్నమాట. ఇది యావరేజ్ రేంజ్ ఆక్యుపెన్సీ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా సోమవారం రోజున విడుదల అవుతుంది. వర్కింగ్ డే రోజున ఈ చిత్రానికి రికార్డు స్థాయి షేర్ వసూళ్లను ఊహించలేము. పైగా ప్రీ ఫెస్టివల్ లో వసూళ్లు చాలా డల్ గా ఉంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి మంచి గ్రాస్ వసూళ్లు వస్తాయి కానీ, రికార్డు రేంజ్ ని మాత్రం ఆశించొద్దని అంటున్నారు. మరో పక్క ఓవర్సీస్ లో ఈ చిత్రానికి అంచనాలకు మించిన గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 6 లక్షల 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం USA నుండి 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కేవలం 1200 షోస్ మాత్రమే ఇప్పటి వరకు షెడ్యూల్ అయ్యాయి. 1500 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేస్తే కచ్చితంగా ఈ చిత్రానికి 1 మిలియన్ కి పైగా ప్రీ సేల్స్ వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక పాజిటివ్ టాక్ వస్తే 15 లక్షల డాలర్లు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.