https://oktelugu.com/

Pawan Kalayan- Junior NTR : పవన్ కళ్యాణ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సహాయం.. కలలో కూడా ఇది ఊహించి ఉండరు!

దేవర విడుదల తర్వాత మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకున్న 'ఓజీ' నిర్మాతలు బయ్యర్స్ ని ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 09:02 PM IST

    Pawan Kalayan- Junior NTR

    Follow us on

    Pawan Kalayan- Junior NTR : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు చూసి మన టాలీవుడ్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో ట్రేడ్ పండితులకు ఒక అంచనా వచ్చింది. గడిచిన 5 ఏళ్లలో కేవలం ప్రభాస్ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా పది రోజుల్లోనే థియేట్రికల్ రన్ ని ముగించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన సరికొత్త జీవో రేట్స్ కారణంగా అతి తక్కువ టికెట్ రేట్స్ తోనే ఆంధ్ర ప్రదేశ్ థియేటర్స్ లో నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెద్ద వసూళ్లను చూడలేకపోయారు ట్రేడ్ పండితులు. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రానికి కూడా ఇదే సమస్య.

    అలాగే మహేష్ బాబు చిత్రాలు భారీ టికెట్ రేట్స్ తోనే విడుదలయ్యాయి కానీ, ఎందుకో అవి ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. దీంతో ప్రభాస్ సినిమాలకు తప్ప ఆ స్థాయి వసూళ్లు ఎవరికీ రావేమో అని అందరూ అనుకున్నారు. ఆ అపోహలను ‘దేవర’ చిత్రం తుడిచిపెట్టేసింది. మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు 400 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తుంది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 110 కోట్ల రూపాయలకు జరిగింది. ఇది విడుదలకు ముందు చాలా ఎక్కువ అని కొందరు, చాలా తక్కువ అని మరికొందరు అనుకున్నారు. కానీ విడుదల తర్వాత వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ మార్కు కి దగ్గరగా రావడంతో రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఓజీ చిత్రం గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి అంతకు ముందు 110 కోట్ల రూపాయిలను రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం డిమాండ్ చేసేవారట నిర్మాతలు.

    ఇప్పుడు దేవర విడుదల తర్వాత మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకున్న ‘ఓజీ’ నిర్మాతలు బయ్యర్స్ ని ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారట. ఇది చిన్న మొత్తం కాదు, 150 కోట్ల రూపాయిల బిజినెస్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండి జరగబోతుండడం పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం అయితే, అంత మార్కెట్ ఉంది అని అందరికీ అర్థం అయ్యేలా చేసింది మాత్రం ‘దేవర’ చిత్రమే. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాకి భారీ బిజినెస్ జరిగేందుకు ఎన్టీఆర్ పరోక్షంగా కారణం అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ‘ఓజీ’ చిత్రం వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.