Aditya Dhar Durandhar Movie Success: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది… ఒక దర్శకుడిని జీరో నుంచి హీరోగా మార్చేది సక్సెస్ మాత్రమే… ఏం చేశాం అనేది ముఖ్యం కాదు సినిమాతో సక్సెస్ ని సాధించామా లేదా అనేదే ముఖ్యం… ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ లు లేక గత కొద్ది సంవత్సరాలుగా వెనుకబడి పోతుంది. వాళ్ళు నుంచి వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించడం లేదు అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్ చేసిన దురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మొదటి పార్ట్ 1300 కోట్లు రాబడితే, రెండో పార్ట్ 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే విధంగా ముందుకు దూసుకెళ్తుంది…
Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ప్రస్తుతం ఆదిత్య ధర్ మీద ప్రతి ఒక్కరు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన కేవలం సంవత్సరన్నర లో ఏడున్నర గంటల ఫుటేజ్ ఉన్న సినిమాని అద్భుతంగా తీశాడు అంటే అతని టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు అత్యద్భుతమైన సినిమాలను తీసి ఉండొచ్చు.
కానీ వాళ్ళు ఒక సినిమా తీయడానికి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం అయితే తీసుకుంటున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం సంవత్సరన్నర లోనే సక్సెస్ ఫుల్ గా రెండు పార్ట్ లను పూర్తి చేశాడు అంటే మామూలు విషయం కాదు… మరి అలాంటి దర్శకుడిని ఎంత పొగిడిన తప్పులేదు. దీనివల్ల నిర్మాత సైతం సేఫ్ జోన్ లో ఉంటాడు. తక్కువ రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తే ప్రొడ్యూసర్స్ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులకు ఫైనాన్స్ కూడా ఎక్కువగా కట్టాల్సిన పని లేదు.
అలాగే సినిమా కంటెంట్ కూడా డైల్యూట్ అవ్వకుండా చాలా ఫ్రెష్ కంటెంట్ తో ముందుకు రావచ్చు… ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లు టాప్ డైరెక్టర్ కావచ్చు. ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేయవచ్చు. గ్రాఫిక్స్ తో వండర్స్ క్రియేట్ చేయచ్చు. కానీ కంటే ఆదిత్య ధర్ లా సినిమాను అంత తొందరగా తీయలేరు. ఈ విషయంలో వల్ల కంటే ఆదిత్య ధర్ ముందు స్థానంలో ఉన్నాడనే చెప్పాలి…
