https://oktelugu.com/

Aditya 369: ‘ఆదిత్య 369’ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి కి ‘చెల్లెలు’ అనే విషయం మీకెవరికైనా తెలుసా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు లో ఈమె చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ,తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అత్యధిక సినిమాలు చేసింది. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె, 1991 వ సంవత్సరంలో 'ఈ రమణ రోజావే' అనే తమిళ aచిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 29, 2024 / 02:24 PM IST

    Aditya 369

    Follow us on

    Aditya 369: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా పిలవబడే చిత్రాలలో ఒకటి ‘ఆదిత్య 369’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద సినిమా తీయాలనే ఆలోచన ఆరోజుల్లో ఒక దర్శకుడుకి రావడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయితే ప్రేక్షకులు పనులు కూడా మానుకొని టీవీ లకు అతుక్కుపోయి చూస్తారు. అలాంటి రిపీట్ వేల్యూ ఉన్న అద్భుతమైన చిత్రమిది. ఈమధ్య కాలం లో ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య బాబు మోడరన్ పాత్రలో, అదే విధంగా శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇదే చిత్రంలో ప్రముఖ హీరో తరుణ్, హీరోయిన్ రాశీ బాలనటులుగా నటించారు. వాళ్లకి కూడా ఈ చిత్రం ద్వారా మంచి పేరొచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మోహిని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు అవుతుంది అన్నారు, అదెలా సాధ్యం?, చిరంజీవి కుటుంబ సభ్యుల గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు అని మీరు ఆలోచించొచ్చు. ‘ఆదిత్య 369’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఈమె, ఆ తర్వాత తెలుగు లో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ రెండు సినిమాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘హిట్లర్’ చిత్రం. ఇందులో ఈమె చిరంజీవి కి పెద్ద చెల్లెలు గా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ని ప్రేమించి, చిరంజీవి ని ఎదిరించి పెళ్లి చేసుకొని, అతనికి శత్రువుగా మారే పాత్రలో ఈమె అద్భుతంగా నటించింది. అలా ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పాత్రలో నటించింది కాబట్టే, ఆమెని చిరంజీవి సోదరి అని సంబోధించాము.ఈ సినిమాకి ముందు ఆమె మోహన్ బాబు తో ‘డిటెక్టివ్ నారదా’ అనే చిత్రం లో నటించింది.

    తెలుగు లో ఈమె చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ,తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అత్యధిక సినిమాలు చేసింది. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె, 1991 వ సంవత్సరంలో ‘ఈ రమణ రోజావే’ అనే తమిళ aచిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నేరుగా ‘ఆదిత్య 369’ చిత్రంలో హీరోయిన్ గా నటించి, ఆ సినిమా హిట్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక మరుసటి సంవత్సరం లో ఈమెకి వరుసగా 7 తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్ల లోపే స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకున్న ఈమె 1999 వ సంవత్సరంలో శ్రీనివాసన్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది.. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె, మళ్ళీ 2004 వ సంవత్సరంలో రీ ఎంట్రీ ఇచ్చి 2011 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ లో నటించిన ఈమె, ప్రస్తుతం కెమెరా కి దూరంగా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంది.