Aditya 369 sequel : నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే ఒక మైలురాయిగా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక ప్రభంజనం. కేవలం కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీ సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఆ రోజుల్లో, ఈ చిత్రం ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని కలిగించింది. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్యతో ఇలాంటి సినిమా చెయ్యాలనే ఆలోచన వచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారికి ఎన్ని సెల్యూట్స్ చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ వచ్చినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఇండియా లో తెరకెక్కిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇదే. ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని బాలయ్య బాబు ఇది వరకే అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘ఆదిత్య 999’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా పెట్టి తీసే ఆలోచనలో ఉన్నారు. ఇది మోక్షజ్ఞ రెండవ సినిమాగా పరిగణించొచ్చు. ఈ చిత్రానికి బాలయ్య బాబే దర్శకత్వం వహించబోతున్నాడట. వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి బాలయ్య నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించబోతున్నాడు. రీసెంట్ గా అన్ స్టాపబుల్ 4 లో బాలయ్య ఈ విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మోక్షజ్ఞ మొదటి సినిమా, హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మోక్షజ్ఞ పుట్టినరోజున విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మోక్షజ్ఞ లుక్ ని చూసిన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సినిమాలో బాలయ్య అర్జునుడి క్యారక్టర్ లో కనిపిస్తుండగా, మోక్షజ్ఞ అభిమన్యుడి క్యారక్టర్ లో కనిపించనున్నాడు. ఇక శ్రీ కృష్ణుడి పాత్రలో నందమూరి తారక రామారావు గారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇది మొత్తం మోడరన్ ఎరా లోనే తెరకెక్కించనున్నారట. మోడరన్ ఎరా లో తెరకెక్కిస్తున్న సినిమాకి, మహాభారతం లోని క్యారెక్టర్స్ కి అసలు సంబంధం ఏమిటి అనేది టీజర్, ట్రైలర్ వచ్చే వరకు ఎవ్వరూ ఊహించలేరు. ఇలా విడుదలకు ముందే రెండు విభిన్నమైన సబ్జక్ట్స్ ని ఎంచుకున్న మోక్షజ్ఞ ని చూస్తుంటే ఈ రెండు సినిమాలతోనే ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే బాలయ్య లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.