Homeట్రెండింగ్ న్యూస్Survey on Lie : నిజాయితీ నిల్‌.. అబద్ధాలు చెప్పడంలో అబ్బాయిలే టాప్‌..! 

Survey on Lie : నిజాయితీ నిల్‌.. అబద్ధాలు చెప్పడంలో అబ్బాయిలే టాప్‌..! 

Survey on Lie : అబద్ధాలు చెప్పేవాళ్ల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతోందట. అందులో మగవాళ్లే, స్త్రీల కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. 1980 నుంచి 2021 మధ్య జన్మించిన వ్యక్తుల వారీగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో పెద్ద, చిన్నా తేడా అనే తారతమ్యం లేకుండా అందరూ అబద్ధాలే చెబుతున్నారని, నిజాయితీగా ఉండే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని సర్వే సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్లేస్టార్‌ అనే ఆన్‌లైన్‌ క్యాసినో దాదాపు 1306 మంది చొప్పున యుఎస్‌లోని వివిధ రాష్ట్రాలపై జరిపినలో సర్వేలో తేలిందని న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. వివిధ పరిస్థితుల్లో ఎలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారో గమనించినట్లు పేర్కొంది.

సర్వే చేసిందిలా.. 
యూస్‌లోని కొలరాడో, ఇల్లనాయిస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టేనస్సీ, విస్కాన్సిన్‌తోపాటు అన్ని రాష్ట్రాలలో సుమారు వెయ్యి మంది చొప్పున చేసిన సర్వేలో పాల్గొన్నారు. వారిలో నిజాయితీ లేని వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 13 శాతం మంది కనీసం ఒక్కసారైన అబద్ధం చెబుతున్నామని అంగీకరించనట్టు పేర్కొంది.
వారిలో తక్కువ.. 
1965–1980 మధ్య జన్మించిన వ్యక్తులను ’జెడ్‌గా’ 1997–2021 మధ్య జన్మించిన వ్యక్తులను ఎక్స్‌గా విభజించి పోల్చి చూస్తే రెండు గ్రూప్‌లలో కేవలం 5 శాతం మంది రోజు అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారని తెలిపింది. అలాగే కార్యాలయాల్లో తమ బాస్‌కి రెజ్యుమ్‌లో తప్పుడు సమాచారమే ఇస్తున్నట్లు తేలింది. ప్రతీ ఐదు మిలియన్ల మందిలో ఇద్దరూ ఇలా చేస్తున్నట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో కూడా ఇదే తంతని, అక్కడ ఈ అబద్ధాల చెప్పే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఆకట్టుకునేందుకే ఎక్కువ అబద్ధాలు.. 
వారంతా ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఈ అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అందులో 58 శాతం మంది ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు, ఇక 42 శాతం మంది గోప్యత కోసం, మరో 42 శాతం మంది తాము చులకన అవ్వకుండా ఉండేందుకు, తమ వ్యక్తి గత రక్షణ కోసం చెప్పినట్లు తెలిపారు. చివరిగా సర్వేలో మహిళలతో పోలిస్తే పురుషులే రోజుకు ఒక్కసారైనా అబద్ధం చెప్పకుండా ఉండలేరని, వారు కూడా దీన్ని అంగీకరించారని సర్వే పేర్కొంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular