https://oktelugu.com/

ప్రభాస్ ‘ఆది పురుష్’.. ఇండియాలో ఇదే తొలిసారి !

నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది అని ప్రకటించడం, దీనికితోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది అనడం.. మొత్తానికి ఈ సినిమా కోసం యావత్తు భారత దేశం ఎదురుచూసేలా చేస్తోంది. అందుకే స్పీడ్ గా ఆదిపురుష్ సినిమా మోషన్ కాప్చర్ […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 11:05 AM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది అని ప్రకటించడం, దీనికితోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది అనడం.. మొత్తానికి ఈ సినిమా కోసం యావత్తు భారత దేశం ఎదురుచూసేలా చేస్తోంది. అందుకే స్పీడ్ గా ఆదిపురుష్ సినిమా మోషన్ కాప్చర్ ప్రారంభమైంది. ఇప్పటికే మేకర్స్ షూట్ కి సన్నాహాలు చెసారు.

    Also Read: పవర్ స్టార్ ఈ నెల 24 నుండి.. !

    కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్. ఏది ఏమైనా హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని ఇండియన్ సినిమాలో పూర్తిగా వాడుకోవడం అంటే.. బహుశా ఇదే తొలిసారి అనుకుంటా.

    Also Read: వర్మ.. ‘ఇది మహాభారతం కాదు’ !

    ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతి సనోన్‌ నటిస్తోంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్