https://oktelugu.com/

కొడాలి వర్సెస్ దేవినేని.. గొల్లపూడిలో గోలగోల..!

రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ముందంజలో నిలిచేది. అయితే ప్రస్తుతం మాత్రం ఏపీ రాజకీయాలు కంపుకొడుతున్నాయి. బూతుమాటలు.. ఒకరినొకరు రెచ్చగొట్టుకొట్టుకోవడాలే ఏపీ రాజకీయాలు అన్నట్లుగా మారిపోయాయి. దీంతో ఏపీ రాజకీయాలంటేనే కంపు రాజకీయాలన్న ఫీలింగ్ అందరిలో కలుగుతోంది. Also Read: వైసీపీలో వారిదే పెత్తనం.. : జగన్‌ కొంపముంచేది వాళ్లేనట..! అధికారంలో ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సహనంతో సమాధానం చెప్పి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 10:56 AM IST
    Follow us on

    రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ముందంజలో నిలిచేది. అయితే ప్రస్తుతం మాత్రం ఏపీ రాజకీయాలు కంపుకొడుతున్నాయి. బూతుమాటలు.. ఒకరినొకరు రెచ్చగొట్టుకొట్టుకోవడాలే ఏపీ రాజకీయాలు అన్నట్లుగా మారిపోయాయి. దీంతో ఏపీ రాజకీయాలంటేనే కంపు రాజకీయాలన్న ఫీలింగ్ అందరిలో కలుగుతోంది.

    Also Read: వైసీపీలో వారిదే పెత్తనం.. : జగన్‌ కొంపముంచేది వాళ్లేనట..!

    అధికారంలో ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సహనంతో సమాధానం చెప్పి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా జగన్ క్యాబినెట్లోని కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే ప్రతిపక్ష పార్టీల నాయకులను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతుండటం శోచనీయంగా మారింది.

    జగన్ సర్కార్ ను ఎప్పుడు బాదానం చేద్దామా? అని వెయిట్ చేస్తున్న టీడీపీకి మంత్రులే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో మంత్రులు వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. మంత్రి కొడాలి నాని ఇటీవల దేవినేని ఉమ నియోజకవర్గమైన గొల్లపూడిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఈ సందర్భంగా కొడాలి నాని ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దేవినేని ఉమను ఇంటికెళ్లి బడితెపూజ చేస్తానంటూ సవాల్ విసిరాడు. రోడ్డు మీదు తాగుబోతులు.. వీధిరౌడీలు సవాళ్లు చేసుకున్నట్లుగా ఆయన మాట్లాడారు. మీడియా సైతం ఈ విషయాన్ని దేవినేని ఉమ వద్ద ప్రస్తావించి మీరు భయపడుతున్నారంటూ అంటూ ప్రశ్నించింది. దీంతో దేవినేని ఉమ కొడాలి నానికి ప్రతి సవాల్ విసిరాడు.

    Also Read: చంద్రబాబును ఛీ అన్న ఎన్టీఆర్.. వైరల్ సాక్ష్యం

    ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు కూర్చుంటానని స్పష్టం చేశాడు. తనకు ఎవరు బడితపూజ చేస్తారో చూస్తానని సవాల్ విసిరారు. పనిలో పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ ఢిల్లీ వెళ్తున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

    కొడాలి నాని.. దేవినేని ఉమ మధ్య మాటాలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువురు నేతలు ఢీ అంటే ఢీ అంటుండటంతో ప్రశాంతంగా ఉంటున్న గొల్లపూడిలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నాయకుల సవాళ్లు.. ప్రతిసవాళ్లపై పోలీసులు ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్