Adipurush -Deepika Chikhalia: ఆదిపురుష్‌ సీత తాజా వివాదం.. రామయణం సీత దీపికా చిక్లియా ఏమందో తెలుసా..!

దీపికా చిక్లియా గతంలో ఆదిపురుష్‌ టీజర్‌పై స్పందించారు. 1.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌లో రావణుడు,హనుమంతుని వర్ణన విజువల్‌ ఎఫెక్ట్స్‌పై వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో దీపికా కూడా ఆదిపురుష్‌ టీజర్‌ను అంగీకరించలేదు.

Written By: Raj Shekar, Updated On : June 9, 2023 12:33 pm

Adipurush -Deepika Chikhalia

Follow us on

Adipurush -Deepika Chikhalia: ఆదిపురుష్‌.. ప్రభాస్‌ రాముడిగా నటించిన సినిమా. కృతి సనన్‌ ఇందులో సీత పాత్రలో నటించారు. అనేక కాంట్రవర్సీలను దాటుకుని విడుదలకు సిద్ధమైంది సినిమా. రామాయణం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన ఆదిపురుష్‌ ట్రైలర్‌ను తిరుపతిలో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా బృందం తిరుమల వేంకటే శ్వరాస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంరౌత్, సీతపాత్ర పోషించిన కృతి సనన్‌ మధ్య జరిగిన సన్నివేశం వివాదాస్పదమైంది. దీనిపై హిందు సంఘాలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై
రామానంద్‌ సాగర్‌ రామాయణంలో టీవీలో సీత పాత్ర పోషించిన దీపిక చిక్లియా స్పందించారు.

సీత పాత్ర ఒక ఎమోషన్‌..
తిరుపతిలో ఆదిపురుష్‌ సినిమా దర్శకుడు ఓంరౌత్, సీత పాత్రధారి, హీరోయిన్‌ కృతిసనన్‌ చెంపపై ముద్దు పెట్టడం వివాదాస్పదం అయింది. ఆలయం ఆవరణలో చెప్పులు వేసుకుని నడవడమే తప్పుగా భావించే భక్తులు, ఈ సన్నివేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓంరౌత్, కృతిసనన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ పెరుగుతోంది. దేవుడి సన్నిధిలో ఇలాంటి పిచ్చివేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో రామాయణం ధారావాహికలో సీత పాత్ర పోషించిన దీపిక చిక్లియా స్పందించారు. సీత పాత్ర అనేది ఓ ఎమెషన్‌ అన్నారు. ఆ పాత్ర వేసే అవకాశం రావడమే ఓ అదృష్టమన్నారు. దానిలో జీవించాలన్నారు. అప్పుడే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందన్నారు.

నేటితరంలో కొరవడిన సెంటిమెంట్‌..
నేతి తరం హీరోహీరోయిన్లలో సెంటిమెంట్‌ కనిపించడం లేదన్నారు. ఏ పాత్ర వేసినా.. దానిని నటనగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. పాత్రలో ఒదిగిపోవడం లేదని పేర్కొన్నారు. తాను రామాయణంలో సీతపాత్ర వేసిన తర్వాత కొన్నేళ్ల వరకూ తనను చాలా మంది సీతగానే భావించారని చెప్పుకొచ్చారు. తాను బయటకు వెళితే చాలా మంది తన పాదాలకు నమస్కరించేందుకు వచ్చేవారని తెలిపారు. తన పాత్ర తనకు అంత గౌరవం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నేటితరం పాత్ర పోషించినంతసేపే దానిగురించి ఆలోచిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తి కాగానే దానిని మర్చిపోతున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనమే తిరుపతిలో జరిగిన సన్నివేశమని పేర్కొన్నారు.

గతంలో టీజర్‌పైనా వ్యాఖ్యలు..
దీపికా చిక్లియా గతంలో ఆదిపురుష్‌ టీజర్‌పై స్పందించారు. 1.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌లో రావణుడు,హనుమంతుని వర్ణన విజువల్‌ ఎఫెక్ట్స్‌పై వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో దీపికా కూడా ఆదిపురుష్‌ టీజర్‌ను అంగీకరించలేదు. ‘రామాయణం విత్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌’ని అసోసియేట్‌ చేస్తున్నానంటూ దీపికా చిక్లియా వ్యాఖ్యానించారు. రామాయణం సత్యం, నైతికతతో కూడిన కథ అని తాను భావిస్తానన్నారు. రామానంద్‌ సాగర్‌ సీరియల్‌ రామాయణం నుంచి ఆదిపురుష వరకు హనుమంతునితో కూడా పోలికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.