https://oktelugu.com/

Adipurush Free Tickets: అంతా ‘ఫ్రీ’..’ఆదిపురుష్’ సినిమా టికెట్స్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టక్కర్లేదు!

మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు అనాదశరణాయలకు, వృద్ధాశ్రమాలకు ఉచితంగా పదివేల టిక్కెట్లు అందిస్తామని ప్రొమోషన్స్ చెయ్యడం కూడా అందరినీ ఎంతో ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇదే బాటలో రామ్ చరణ్ మరియు రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు కూడా తమ వంతుగా చెరో పది వేల టిక్కెట్లు అనాధపిల్లల కోసం ఉచితంగా అందిస్తాము అంటూ ముందుకు వచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 12, 2023 / 07:55 AM IST

    Adipurush Free Tickets

    Follow us on

    Adipurush Free Tickets: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే వారం అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ ని జారీ చేసారు. ఓవర్సీస్ లో నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, ఇండియా లో ఈరోజే కొన్ని ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.

    రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తుంది. సినిమాకి సంబాణిధించిన ట్రైలర్స్ , పాటలు జనాలకు బాగా రీచ్ అవ్వడం వల్లే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం నుండే మంచి ట్రెండ్ ని కొనసాగిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాదు మేకర్స్ చేస్తున్న ప్రొమోషన్స్ కూడా ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా అంచనాలను పెంచేలా చేసింది.

    ఇకపోతే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు అనాదశరణాయలకు, వృద్ధాశ్రమాలకు ఉచితంగా పదివేల టిక్కెట్లు అందిస్తామని ప్రొమోషన్స్ చెయ్యడం కూడా అందరినీ ఎంతో ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇదే బాటలో రామ్ చరణ్ మరియు రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు కూడా తమ వంతుగా చెరో పది వేల టిక్కెట్లు అనాధపిల్లల కోసం ఉచితంగా అందిస్తాము అంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా మ్యానేజ్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ ప్రాంతం లో 5 వేల టిక్కెట్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ముందుకొచ్చారు.

    ఈ సినిమా నుండి డబ్బులు ఎక్కువగా ఆశించడం లేదని, కేవలం రామాయణం ని నేటి తరం ప్రజలకు ఎక్కువగా చూపించడమే మా లక్ష్యం అని మేకర్స్ అంటున్నారు. వాళ్ళ కృషి ఆడియన్స్ హృదయాలను హత్తుకుంది.ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.