Adi Purush: బాహుబలి విజయం తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇందులో ఒకటైన ప్రాజెక్ట్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయారు. మరోవైపు కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండటం విశేషం.
కాగా, ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ షూటింగ్ పూర్తి చేసుకోగ, సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌కు కంప్లీట్ చేసుకుంది. తాజాగా, ఓం రౌత్ ప్రభాస్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. దీంతో ముంబైలోని సెట్లో వందరోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న సంబర్భంగా కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ షూటింగ్ పార్ట్ పూర్తి చేయడంతో, బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉండనున్నట్లు సమాచారం.
మరోవైపు రాధేశ్యామ్ షూటింగ్లో పూర్తి బిజీగా ఉన్నారు ప్రభాస్. రాధా కృష్ణ దర్శకత్వంలో యూవీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. పూజా హెగ్డె హీరోయిన్గా కనిపించనుంది. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.