Liger Movie: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ లైగర్ ’. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు అని చెప్పాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీపావళి కానుకగా చిత్రా బృందం అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఈ సినిమా లో మైక్ టైసన్ కు సంబంధించి ఒక పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఫోటోలో మైక్ టైసన్ బ్యాక్సింగ్ కు సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నాడు. చేతి నుంచి నిప్పులు విరజిమ్ముతూ అభిమానులకు అదిరిపోయే రేంజ్ ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈపోస్టర్ తో మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి.
Legend @MikeTyson
is ready to beat the shit🤙🏻out of our #Liger 👊🏻 @TheDeverakonda 🥊#AagLagaDenge 🔥#HappyDiwali @karanjohar #Purijagannadh @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects @meramyakrishnan @IamVishuReddy @PrashanthUSA pic.twitter.com/0eu3gsxHdC— Puri Connects (@PuriConnects) November 4, 2021
సినిమా ప్రీ క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పై వచ్చే ఎపిసోడ్స్ కూడా గోవాలోనే చిత్రికరించనున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో రమ్యకృష్ణ, మక్రంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.