https://oktelugu.com/

Hyper Aadi: హైపర్ ఆదిపై అదిరే అభి షాకింగ్ కామెంట్స్… తొక్కేయాలని అనుకున్నాడా!

ప్రస్తుతం అభి బుల్లితెర పై ఎటువంటి షోలు చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అభి .. హైపర్ ఆది గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 30, 2024 / 10:15 AM IST

    Adhire Abhi shocking comments on Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో అదిరే అభి ఒకరు. తనదైన కామెడీ తో ఆకట్టుకున్నాడు. చాలా కాలం జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా పని చేశాడు. నాగబాబు జబర్దస్త్ మానేసిన కొంత కాలానికి అదిరే అభి కూడా ఈ షో కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత మా టీవిలో కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చేశాడు. ప్రస్తుతం అభి బుల్లితెర పై ఎటువంటి షోలు చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అభి .. హైపర్ ఆది గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    అదిరే అభి మాట్లాడుతూ .. నేను జబర్దస్త్ లో కెరీర్ మొదలుపెట్టినప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. హైపర్ ఆది ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పెట్టాడు. తాను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ పోస్ట్ చేసి అన్నా ఒకసారి చూడండి అని రిక్వెస్ట్ చేసాడు. నాకు టైం ఉన్నప్పుడు చూశాను. బాగుంది అనిపించింది. దీంతో కమ్ అండ్ మీట్ మీ అని రిప్లై ఇచ్చా. నన్ను కలిసి నాతో కొన్ని జోక్స్ షేర్ చేసుకున్నాడు. అవి కూడా బాగున్నాయి.

    ఆ తర్వాత నన్ను రెగ్యులర్ గా కలుస్తూ స్కిట్స్ లో జోక్స్ కి ఐడియాలు ఇచ్చేవాడు. నెమ్మదిగా కొన్ని జోక్స్ రాసుకుని తీసుకురా అని చెప్పా. అలా ఎంకరేజ్ చేస్తూ ఉండగా స్కిట్ రాసే స్టేజ్ కి వచ్చాడు. ఆ తర్వాత నా టీం లోకి తీసుకున్నాను. బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హైపర్ ఆదిని టీం లీడర్ గా పెట్టి కొత్త టీం క్రియేట్ చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్స్ చెప్పారు. ఆది ఎదుగుతున్నప్పుడు వెన్నక్కి లాగాలని కానీ, తొక్కేయాలని కానీ నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు.

    ఒకరు ఎదుగుతున్నప్పుడు వీలైతే సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. హైపర్ ఆదికి మంచి టాలెంట్ ఉంది. నాకు వీలైనంత సపోర్టు ఇచ్చా. నా వల్లే ఆది ఈ స్టేజ్ లో ఉన్నాడు అని చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదని అభి చెప్పుకొచ్చాడు. నిజానికి హైపర్ ఆది ఈ స్థాయిలో ఉన్నాడంటే.. అభి పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆదికి జబర్దస్త్ లో మొదటి అవకాశం అభి ఇచ్చాడు. అలా జబర్దస్త్ కి వచ్చిన ఆది ఇప్పుడు సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు.