Pressure Cooker: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వంటింట్లో కనిపించే వస్తువులలో తప్పనిసరిగా ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వలన తొందరగా వంట పని పూర్తి చేయడం కోసం కుక్కర్ లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్కరు ఆహారపదార్థాలను కుక్కర్లో చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను కుక్కర్లో చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మరికొన్ని పదార్థాలను కుక్కర్లో చేయడం వల్ల అవి విషపూరితంగా మారుతాయి. మరి కుక్కర్ లో చేయకూడని ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: నాకే తిండి దొరకడం లేదు.. ఇక పుట్టే బిడ్డను ఎలా సాకాలి..?’: అప్ఘాన్లో తీవ్ర ఆహార సంక్షోభం..
సాధారణంగా ప్రెజర్ కుక్కర్ లో చాలామంది చేసే ఆహార పదార్థాలలో అన్నం ఒకటి. అయితే పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండకూడదు. ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం వల్ల అది విష పదార్థంగా మారుతుంది. ప్రెజర్ కుక్కర్ లో అన్నం చేయడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. దీని ప్రభావం వెంటనే చూపకపోయినా నిదానంగా ఈ రసాయనాల ప్రభావం మనపై చూపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని వెంటాడుతాయి.
బంగాళదుంపలను కూడా ప్రెజర్ కుక్కర్ లో పెట్టకూడదు. బంగాళదుంపలలో స్టార్చ్ అధికంగా ఉండటం వల్ల వీటిని కుక్కర్లో ఉడకపెట్టకూడదు.పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను దీర్ఘకాలికంగా కుక్కర్లో ఉడక పెట్టీ వంట చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అదే విధంగా న్యూరోలాజికల్ డిజార్డర్ వ్యాధులు వస్తాయి. అలాగే పాస్తా వంటి ఆహార పదార్థాలను కూడా వండకూడదు. ఈ మూడు ఆహారపదార్థాలను కుక్కర్ లో వండినపుడు మాత్రమే విషపదార్థాలుగా మారుతాయి.ఇది కాకుండా మిగిలిన ఆహార పదార్థాలను కుక్కర్లో వండటం వల్ల ఎంతో ఆరోగ్యకరం.
Also Read: ప్రతిరోజు చపాతీలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?