https://oktelugu.com/

సాగు చట్టాల వివాదం.. రైతులను అనలేక.. విదేశీమద్దతుదారులపై దాడులా..?

రైతు ఉద్యమంపై వ్యవసాయం తెలియని వారు సైతం స్పందించడం.. అదీ తమకు తోచిన విధంగా మాట్లాడడం వివాదాస్పదం అవుతోంది. దేశానికి అన్నం పెట్టే రైతులు చేస్తున్న సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంపై కొందరు పాప్ గాయకులు.. పోర్ను స్టార్లు.. స్పందించడంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై వాళ్లు ప్రభుత్వానికి దగ్గర కావడం కోసం.. సచిన్ తెందుల్కర్తో సహా తెగ ఇదైపోతున్నారు. వీళ్లంతా మూకుమ్మడి దాడి చేసేసరికి తమకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని కంగనా రనౌత్ కంగారు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2021 / 01:05 PM IST
    Follow us on


    రైతు ఉద్యమంపై వ్యవసాయం తెలియని వారు సైతం స్పందించడం.. అదీ తమకు తోచిన విధంగా మాట్లాడడం వివాదాస్పదం అవుతోంది. దేశానికి అన్నం పెట్టే రైతులు చేస్తున్న సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంపై కొందరు పాప్ గాయకులు.. పోర్ను స్టార్లు.. స్పందించడంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై వాళ్లు ప్రభుత్వానికి దగ్గర కావడం కోసం.. సచిన్ తెందుల్కర్తో సహా తెగ ఇదైపోతున్నారు. వీళ్లంతా మూకుమ్మడి దాడి చేసేసరికి తమకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని కంగనా రనౌత్ కంగారు పడుతున్నట్లు ఉంది. ఇన్నాళ్లు కంగనా ఒక్కతే వీరంగం ఆడేది. ఇప్పడు మిగితా వారు కౌంటర్లు ఇచ్చేసరికి.. కంగనా కంగారు పడుతోంది. ఈ క్రమంలోనే చాకిరేవు వద్ద కుక్కలు అనేసింది….

    Also Read: రైతులపై యుద్ధం చేయబోతున్నారా..? ఏంటీ దారుణం..?

    ఆ సంగతులు అలా పక్కన పెడితే..ఈ సెలబ్రెటీ మేధావులు.. సెలబ్రెటీలు అయినందున మేధావులు అయినవారి వీరంగాలు చూస్తే.. వేరేవి గుర్తుకు వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వీళ్లు తెగ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఒక సమయలో మనం విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలు సైతం గుర్తుకు వస్తాయి.

    Also Read: మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్న బీజేపీ..!

    గతంలో వికిలీక్స్ వ్యవహారలో భారతీయ పేపర్లు వందల, వేల వ్యాసాలు రాశాయి. అమెరికన్ ప్రభుత్వ విధానాలను వివరిస్తూ.. కూసాలు కదిలించిన అసాంజ్ కు మద్దతుగా భారత్ లో అప్పట్లో పెద్ద ఉద్యమమే నడిచింది. ఇక ఎడ్వర్డ్ స్నోడెన్ కు కూడా ఇండియాలో పెద్ద ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలాంటి వ్యవహారాలన్నింటికీ.. మనం అప్పడు మద్దతు పలికాం. అంతెందుకు.. ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ లో వీరంగం సృష్టించినప్పడు ప్రజాస్వామ్య విలువల గురించి గంటల తరబడి చర్చించుకున్న సందర్భాలు ఎన్నో.. ఇవన్నీ సోల్లు కబుర్లు అంటారా..?

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

    అసలు విషయానికొస్తే.. మన దేశ ప్రధాని మోదీ.. అమెరికాకు వెళ్లి.. ‘ఆబ్కీ బార్ ట్రంప్ సర్ కార్’ నినాదాంతో తన మిత్రడిని రంజింపచేయలేదా..? అది అబద్ధమా..? నేషనలిస్టులు ఆ నినాదాన్ని ఇస్తుండగానే మోదీ వారిని ఉత్సాహ పరిచాడు కదా..??? ఒక దేశానికి వెళ్లి విదేశాంగ వ్యవహారాలు చక్కబెట్టుకుటే అది బాధ్యత… అక్కడ ఏ ప్రభుత్వం ఉంటే.. మనకెందుకు..? అక్కడ ఎవరి సర్కారు ఉంటే మనకు ఎందుకు..? మన దేశ ప్రధాని ఎవరైనా వెళ్లి.. అక్కడ వాళ్ల ప్రభుత్వం ఏర్పడాలి అని ప్రచారం చేసిన చరిత్ర ఉందా..? అదా మన విధానం..? మన నేషనలిస్టులు విదేశాల్లో రాజకీయ పిలుపులు ఇస్తే.. మనకు రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ఎవరో పోర్ను, పాపుస్టారుల.. వ్యవసాయ ఉద్యమం గురించి మాట్లాడితే.. ఇక్కడ వీరంగం జరుగుతుంది..? వాళ్ల దిష్టిబొమ్మల దహనాలకు కాషాయ భక్తులు పోటీ పడుతున్నారు. వ్యవసాయ దారులకు సమాధానం చెప్పలేక, విదేశీ పోర్నుస్టార్ల దిష్టిబొమ్మల దహనానికి వచ్చింది మన వ్యవహారం..