https://oktelugu.com/

Vaishnavi Chaitanya: మాటలు రావడం లేదంటున్న అల్లు అర్జున్ చెల్లి… ఎందుకంటే ?

Vaishnavi Chaitanya: యూట్యూబర్ వైష్ణవి చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ, వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది లాక్డౌన్ సమయంలో షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సాఫ్ట్‌వేర్ డెవలవ్‌పర్ వెబ్ సిరీస్ అయితే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ కొల్లగొట్టేసింది. అలా మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో షన్ను, వైష్ణవి పేర్లు మార్మోగిపోయాయి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 05:20 PM IST
    Follow us on

    Vaishnavi Chaitanya: యూట్యూబర్ వైష్ణవి చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ, వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది లాక్డౌన్ సమయంలో షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సాఫ్ట్‌వేర్ డెవలవ్‌పర్ వెబ్ సిరీస్ అయితే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ కొల్లగొట్టేసింది. అలా మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో షన్ను, వైష్ణవి పేర్లు మార్మోగిపోయాయి.

    అయితే యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్, క్రేజ్‌ను చూసి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లిగా నటించి అందరినీ మెప్పించింది ఈ చిన్నది. అలానే నాని నటించిన టాక్ జగదీష్ మూవీ లోనూ నటించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా ఆనంద్ దేవరకొండతో కలిసి “బేబీ” అనే సినిమా చేస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది.

    నేడు వైష్ణవి చైతన్య బర్త్ డే సందర్భంగా హీరో డైరెక్టర్ నిర్మాత ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పేశారు. అయితే ఓ అభిమాని తన ప్రేమను పచ్చబొట్టు వేయించుకుని మరీ చూపించాడు. వైష్ణవీ అంటూ టాటూ వేయించుకున్న ఆ అభిమాని వీడియోను ఈ ముద్దుగుమ్మ చూసింది. కాగా ఆ వీడియొ పై స్పందిస్తూ మాటలు రావడం లేదు, ఏం చెప్పాలో తెలియడం లేదని… ఐ లవ్యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది వైష్ణవి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.