https://oktelugu.com/

RGV vs Kodali Nani: ఆయనెవరో నాకు తెలీదు.. మంత్రి కొడాలి నానిపై వర్మ వ్యంగ్యాస్త్రాలు

RGV vs Kodali Nani: ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ల ధర తగ్గింపు విషయమై టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కారు అనే సీన్ క్రియేట్ అయి ఉంది. ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్నది. ప్రజెంట్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందులో దూరిపోయి ఏపీ ప్రభుత్వాన్ని మంత్రులను ఈ విషయమై ప్రశ్నించగా, వారు సమాధానాలిచ్చారు. కాగా, ఈ క్రమంలోనే మంత్రులు కౌంటర్స్ ఇస్తుండగా, ఆర్జీవీ తనదైన శైలిలో వాటికి మళ్లీ సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా ఏపీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 5, 2022 / 05:11 PM IST
    Follow us on

    RGV vs Kodali Nani: ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ల ధర తగ్గింపు విషయమై టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కారు అనే సీన్ క్రియేట్ అయి ఉంది. ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్నది. ప్రజెంట్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందులో దూరిపోయి ఏపీ ప్రభుత్వాన్ని మంత్రులను ఈ విషయమై ప్రశ్నించగా, వారు సమాధానాలిచ్చారు. కాగా, ఈ క్రమంలోనే మంత్రులు కౌంటర్స్ ఇస్తుండగా, ఆర్జీవీ తనదైన శైలిలో వాటికి మళ్లీ సెటైర్స్ వేస్తున్నారు. తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందించారు.

    RGV vs Kodali Nani

    టికెట్ ధరలను నియంత్రించే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఎక్కడిది అని వర్మ ప్రశ్నించారు. కాగా ఈ ప్రశ్నకు కొడాలి నాని జవాబిచ్చారు. ఏపీ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని, ప్రజలు తమకు అధికారం అప్పగించారని, వారికి మాత్రమే తాము జవాబుదారీగా ఉంటామని కొడాలి నాని అన్నారు. ఈ క్రమంలోనే తాము పక్క రాష్ట్రంలో ఉండి అక్కడ కూర్చొని సినిమాలు తీసుకుంటున్న వ్యక్తులకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కొడాలి నాని కామెంట్స్ చేశారు.

    Also Read: ఓహో.. వర్మ – నాగబాబు మధ్య స్నేహం కుదిరింది !

    కొడాలని నాని కామెంట్స్‌పైన ఈ సందర్భంగా తాజాగా వివాదాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కొడాలి నాని కౌంటర్‌కు సమాధానం చెప్పాలని తననున కొందరు అడుగుతున్నారని, అయితే, తనకు తెలిసిన నాని టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని ఒక్కడేనని, వాళ్లు చెప్తున్న కొడాలి నాని ఎవరో తనకు తెలియదని రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

    మొత్తంగా టికెట్ల ధర తగ్గింపు విషయం పక్కకుపోయి వైసీపీ మంత్రులు వర్సెస్ డైరెక్టర్ ఆర్జీవీ అనే పరిస్థితులు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో స్పష్టమవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా వార్ ఇంకా కొనసా..గుతూనే ఉంది. వర్మ ట్వీట్స్ నేపథ్యంలో వైసీపీ వర్గాలు స్పందించే చాన్సెస్ ఉంటాయి. మళ్లీ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించే చాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వర్మ వ్యాఖ్యలకు స్పందంచి సమాధానాలు ఇచ్చారు. కానీ, వివాదం తగ్గకపోగా ఇంకా ఎక్కువవుతున్నది.

    Also Read: స్నేహితుడే శత్రువయ్యాడు.. జగన్ కు వర్మ విలన్ ఎందుకయ్యాడు?

    Tags