https://oktelugu.com/

Actress Tamannah: ఆ సినిమా కోసం తమన్నా ఎంత తీసుకుంటుందో తెలుసా …

Actress Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా… హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూనే ఉంది తమన్నా. ఒక వైపు వెండితెరపై సత్తా చాటుతూనే… మరోవైపు బుల్లితెరపై కూడా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 09:30 AM IST
    Follow us on

    Actress Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా… హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూనే ఉంది తమన్నా. ఒక వైపు వెండితెరపై సత్తా చాటుతూనే… మరోవైపు బుల్లితెరపై కూడా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో ప్రేక్షకులను అలరించింది తమన్నా. మ్యాస్ట్రోలో మొదటి సారి విలన్ పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది. అయితే తాజాగా తమన్నా కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

    ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన “భోళా శంకర్”  సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన  “వేదాళం” చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో చిరంజీవితో కలసి సైరా నరసింహా రెడ్డి మూవీలో కీలక పాత్రలో నటించింది తమన్నా. కాగా ఇప్పుడు మరోసారి చిరుకి జోడీగా నటించనుంది. అయితే ఈ మూవీ కోసం తమన్నా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ మేయరకు నిర్మాతలు కూడా అంగీకరించి సగం పేమెంట్ ఇచ్చారని తెలుస్తుంది.

    ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా  కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా ఈ నెల 11న పూజా కార్యక్రమాలు జరుపుకుని… 15 నుంచి సెట్స్ పైకీ వెళ్లనుంది. మరోవైపు తమన్నా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న “ఎఫ్ 3” లో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది.