Pawan Kalyan: పవన్​ హరిహర వీరమల్లు షూటింగ్​ పునఃప్రారంభం అప్పటినుంచే!

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. మొగల్​ చక్రవర్తుల కాలానికి చెందిన వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి భారీ సెట్లు వేశారు. ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్​ పూర్తి చేసుకుంది చిత్రబృందం. మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే, ఆ తర్వాత భీమ్లా నాయక్​ సినిమాకు ఒప్పుకున్న పవన్​ కల్యాణ్​ ఈ గ్యాప్​లో భీమ్లా నాయక్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 4, 2021 9:52 am
Follow us on

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. మొగల్​ చక్రవర్తుల కాలానికి చెందిన వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి భారీ సెట్లు వేశారు. ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్​ పూర్తి చేసుకుంది చిత్రబృందం. మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే, ఆ తర్వాత భీమ్లా నాయక్​ సినిమాకు ఒప్పుకున్న పవన్​ కల్యాణ్​ ఈ గ్యాప్​లో భీమ్లా నాయక్​ షూటింగ్​ పూర్తి చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్​ ప్రారంభించి.. వచ్చే సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు పవన్​ తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

కాగా, ప్రస్తుతం వీలైనంత త్వరగా వీరమల్లు ప్రాజెక్టును సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు పవన్​- క్రిష్​ చూస్తున్నట్లు టాక్​. దీపావళి పండుగ తర్వాత పవన్​ షూటింగ్​లో పాల్గొననున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. వచ్చే ఏడాది ఏప్రిల్​ 29న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కె. సాగర్​ చంద్ర దర్శకత్వంలో రానా- పవన్​ కల్యాణ్​ కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్​. ఇటీవలే విడుదలైన పవన్​- రానా పాత్రలకు సంబంధించిన ప్రోమోలు నెట్టింట్లో వైరల్​ అయ్యాయి. కాగా, దీపావళి కానుకగా లాలా భీమ్లా నాయక్​ సాంగ్​ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో పవన్​ కల్యాణ్​ బొట్టు పెట్టుకుని, చేతిలో మందు బాటిల్​ పెట్టుకుని దీపావళి ముందుగానే వచ్చిందంటూ ఓ డైలాగ్​ వేస్తారు. ఈ క్రమంలోనే బాంబు పేలుస్తారు. ఈ వీడియోతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.