https://oktelugu.com/

Actress Tamannah: ఆ మూవీ పై ఆశలు పెట్టుకున్న మిల్కీ బ్యూటీ…

Actress Tamannah: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ భామ ఇటీవల ఒక షో ద్వారా సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవలే ఒక టీవీ ఛానల్ కి హోస్ట్ గా వ్యవహరించారు తమన్నా హెస్టింగ్ స‌రిగా లేద‌ని… కోట్ల‌లో న‌ష్టం వ‌చ్చింద‌ని ఆ షో నిర్వ‌హ‌కులు ఆమెను మ‌ధ్యలోనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 06:49 PM IST
    Follow us on

    Actress Tamannah: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ భామ ఇటీవల ఒక షో ద్వారా సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవలే ఒక టీవీ ఛానల్ కి హోస్ట్ గా వ్యవహరించారు తమన్నా హెస్టింగ్ స‌రిగా లేద‌ని… కోట్ల‌లో న‌ష్టం వ‌చ్చింద‌ని ఆ షో నిర్వ‌హ‌కులు ఆమెను మ‌ధ్యలోనే తొలగించారు. త‌న స్థానంలో అనుసూయను నియమించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ క్రేజ్ తగ్గుతుందని చెప్పాలి.

    ఓటిటి విడుదలైన మాస్ట్రో, సీటీమార్ వంటి చిత్రాలు ఊహించనంత విజయం అందుకోలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3పై మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది… వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. తమన్నా ఈ మూవీ పై ఆశలు పెట్టుకుంది అనే చెప్పుకోవాలి.

    “భోళా శంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడిగా త‌మ‌న్నాను హీరోయిన్ తీసుకున్న‌ట్లు టాక్ వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకుంది అని సినీ వర్గాలలో చర్చనీయాంశం అవుతుంది.  ప్రస్తుతం ఈ భామకు టైం కలిసి రాలేదనే చెప్పాలి. సత్యదేవ్ తమన్నా కాంబినేషన్ లో వస్తున్న ” గుర్తుందా శీతాకాలం ” , ” దట్ ఈజ్ మహాలక్ష్మి”… బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ.