Ys Sharmila: ‘మంగళవారం మరదలు’, కుక్క.. టీఆర్ఎస్ మంత్రి-వైఎస్ షర్మిల మధ్య దారుణ బూతులు

Ys Sharmila: ఏపీలో మొదలైన బూతు రాజకీయం తెలంగాణకు పాకిందనే చెప్పాలి. తాజాగా నాగర్ కర్నూలుకు చెందిన టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో తన నోటి నుంచి కొన్ని బూతులు అలా విసిరారు.. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ చెల్లెలును పట్టుకొని ‘మంగళవారం మరదలు’ అంటూ నోరుపారేసుకున్నారు. షర్మిలపై దారుణ పదజాలం వాడారు. ఇది దుమారం రేపింది. ఎంతైనా ఆడకూతురు.. పైగా రాజకీయ నాయకురాలు.. ఆమెను పట్టుకొని టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ […]

Written By: NARESH, Updated On : October 28, 2021 7:27 pm
Follow us on

Ys Sharmila: ఏపీలో మొదలైన బూతు రాజకీయం తెలంగాణకు పాకిందనే చెప్పాలి. తాజాగా నాగర్ కర్నూలుకు చెందిన టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో తన నోటి నుంచి కొన్ని బూతులు అలా విసిరారు.. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ చెల్లెలును పట్టుకొని ‘మంగళవారం మరదలు’ అంటూ నోరుపారేసుకున్నారు. షర్మిలపై దారుణ పదజాలం వాడారు. ఇది దుమారం రేపింది. ఎంతైనా ఆడకూతురు.. పైగా రాజకీయ నాయకురాలు.. ఆమెను పట్టుకొని టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి వాడిన పదజాలం సభ్యసమాజం హర్షించలేనిది.

niranjan reddy sharmila-1

అందుకే షర్మిల కూడా ఘాటు వ్యాఖ్యలే చేసింది. మంత్రి నిరంజన్ రెడ్డి ‘కుక్క’ అంటూ దుమ్మెత్తిపోసింది. చంద్రుడిని చూసి కుక్కలు మొరుగుతాయని.. అసలు సభ్యత, సంస్కారం లేని వారు టీఆర్ఎస్ కేబినెట్ లో కుక్కలుగా ఉన్నారని నిప్పులు చెరిగింది.

తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి నిరుద్యోగ సమస్యలపై షర్మిల పోరాడుతున్నారు. నాన్న వైఎస్ఆర్ పథకాలను మళ్లీ తీసుకొస్తానని వారి అభిమానులతో చేరువ అవుతున్నారు. ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ తాజాగా పాదయాత్ర చేపట్టారు. టీఆర్ఎస్ ను నిలదీస్తూ ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తూ షర్మిల ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయాలని కేసీఆర్ ను నిలదీస్తున్నారు.

ఈ క్రమంలోనే మంత్రి నిరంజన్ రెడ్డి నోరుపారేసుకున్నారు. ‘మంగళవారం మరదలు ఒకామె బయలుదేరింది’ అంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. షర్మిల డిమాండ్ వెనుక ఆంద్రోళ్ల కుట్ర ఉందని.. 20 శాతం నాన్ లోకల్ కోటాలో తెలంగాణ ఉద్యోగులను పొందేందుకు ఆంధ్రవాళ్ల కోసం షర్మిల మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనికి కుక్క అంటూ షర్మిల బదులిచ్చింది. నన్ను మరదలు అంటున్న ఆ మంత్రి సీఎం కేసీఆర్ కూతురు కవితను ఏం అంటారని నిలదీసింది. రాజకీయాల్లో నేతల మధ్య సహేతుక విమర్శలు సహజం కానీ ఇలా దిగజారి విమర్శలు చేయడం.. ఒక మహిళ అని కూడా చూడకుండా షర్మిలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • షర్మిల మాట్లాడిన వీడియో