Sri Sathya: బుల్లితెర నటి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ సత్య నిన్నే పెళ్ళాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు, త్రినయని వంటి సీరియల్స్ తో అలరించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది శ్రీ సత్య. బుల్లితెర మీద ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన నటీనటులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సినిమాల్లో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకటి. హీరోయిన్ లుక్, ఆకట్టుకునే అందం ఉన్న నటి శ్రీ సత్య. సోషల్ మీడియా లో ఈమె చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే రియాలిటీ షో బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొంది శ్రీ సత్య. సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు, త్రినయని వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించింది. బిగ్ బాస్ 6 పాల్గొన్న శ్రీ సత్య తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో 103 రోజుల వరకు తన ఆటతో ఆకట్టుకుంది.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ సత్య కు అంతగా అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా గడిపేస్తుంది. తన రకరకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పలు టీవీ డాన్స్ షోస్ తో బిజీగా గడుపుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ తో కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేస్తుంది శ్రీ సత్య.ఈ ఆల్బమ్ కు నెటిజన్ల నుంచి ఊహించని రేంజ్ లో స్పందన వస్తుంది.రీసెంట్ గా కూడా ఈ అమ్మడు ఒక వీడియొ ను షేర్ చేసింది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన సత్య హీరో రామ్ పోతినేని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను.మళ్ళీ ఆయన సినిమాలో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.గతం లో హీరో రామ్ పోతినేని అంటే తనకు చాల ఇష్టమని శ్రీ సత్య తెలిపింది.ప్రస్తుతం మరోసారి రామ్ పోతినేని పై తనకున్న అభిమానాన్ని తెలిపింది.