Sai Dharam Tej
Sai Dharam Tej: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా మేనల్లుడిగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన సాయిధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో బిజీగా మారిపోయారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన మామయ్యల బాటలోనే పయనిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. తాజాగా కాలేయం సమస్యతో బాధ పడుతున్న ఒక పాపకు తన వంతు సహాయం అందించి తన మంచి మనసు చాటుకున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం హీరో సాయిధరమ్ తేజ్ బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మెగా హీరో సిక్స్ ప్యాక్ లో కూడా కనిపించనున్నాడు. ఈ మధ్యకాలంలో మెగా హీరో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. సాయం కోరి తన దగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా కూడా సహాయం కోరిన వారికి అండగా నిలుస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఇటీవల తనకోసం సినిమా సెట్ కు వచ్చిన తన అభిమానులకు ప్రత్యేకంగా భోజనం చేయించి మరి కడుపునింపాడు ఈ మెగా హీరో. తాజాగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి తన వంతు సహాయాన్ని అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అలాగే మరి కొంతమంది ఈ చిన్నారికి సాయం చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా సాయి ధరంతేజ్ అభ్యర్థించాడు.
ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు సాయిధరమ్ తేజ్. ఈ స్టోరీస్ లో హయా అనే అమ్మాయి కాలేయ వ్యాధి సమస్యతో ప్రస్తుతం బాధపడుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఈ పాప చికిత్స తీసుకుంటుంది. ఆమె ట్రీట్మెంట్ కోసం నా వంతుగా నేను సహాయం చేశాను. దయచేసి మీరు కూడా ఎంతోకంతా డబ్బును ఇవ్వండి. ప్లీజ్ మీరు చేసే సహాయం వల్ల ఆ పాప ప్రాణాలతో ఉంటుంది. ప్రతి డొనేషన్ చాలా ముఖ్యమైనది. ఆమె ఓ పోరాట యోధురాలు. మీరు సహాయం చేయడం వల్ల ఆ పాప సమస్య నుంచి బయటపడుతుంది అని మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రాసుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
ఈ పోస్ట్ కు స్పందించి అభిమానులు తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నటిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.