Samantha Fire On Nitizans: ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌కి టాలీవుడ్ బ్యూటీ సమంత హజరయ్యారు. కాగా ఆ ఫంక్షన్‌లో సమంత ధరించిన దుస్తులపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్‌పై సమంత ఘాటుగా స్పందించింది. ‘‘ఇప్పుడు మనం 2022లో ఉన్నాం.. ఇప్పటికీ స్త్రీ ధరించే డ్రెస్‌ల ఆధారంగా జడ్జ్ చేయడం మానేసి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టుకోలేమా?’’ అంటూ స్పందించింది.

అయినా సమంత బాడీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అందంలోనూ అమ్మడు బోల్డ్ ఫోజులు ఇవ్వడంలోనూ బాగా అరితేరిపోయింది. అయినా ఎన్ని బోల్డ్ ఫోజులు ఇవ్వకపోతే సామ్ ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. అయితే, ఆమె ఎక్స్ పోజింగ్ పై తాజాగా నెటిజన్లు మరోసారి ఫైర్ కావడం.. ఆమెకు అస్సలు నచ్చలేదు. నిజమే కావొచ్చు.. సమంత తన హాట్ డోస్ ను పెంచి.. మునుపెన్నడూ కనిపించని విధంగా పిచ్చెక్కిచొచ్చు.
Also Read: అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడండోయ్..
ఆలా ఎక్కిస్తే ఎందుకు ఊరుకుంటారు. అందుకే.. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీకి లేని తలనొప్పులు తెస్తుందని మండిపడుతున్నారు. మొత్తానికి సామ్ తన అందాల ప్రదర్శనతో అందరికీ షాక్ ఇచ్చింది. అసలు చూడటానికి సన్నగా.. నాజూగ్గా కనిపించే సమంత రోజురోజుకు బరితెగిస్తోంది అంటున్నారు. అన్నట్టు హీరోయిన్ గా సమంత ఫుల్ బిజీగా ఉంది.

నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. ఏది ఏమైనా తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులకు సంబంధించి ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది.
‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందా అని ఆరా తీస్తే చైతుని ఉద్దేశించే పోస్ట్ చేసిందని తెలిసింది.
Also Read: ‘రాధేశ్యామ్’ మిక్స్ డ్ టాక్ అని ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య