Andhra Pradesh: పంటలెక్కువైనా ఈ పథకాలలెందుకు ప్రతి ఇంట్లో సంతాన పరిమితి లేనందుకు అనే నినాదంతో పేదలకు బియ్యం అందించే పథకం ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పథకం. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న బియ్యం పేదవారి ఆకలి తీరుస్తున్నాయి. కానీ ఇటీవల కొందరు బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. దీంతో వారికి నేరుగా డబ్బులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది.

పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని అనకాపల్లి, గుజవాడ, కాకినా, నరసాపురం, నంద్యాల ప్రాంతాలను ఎంచుకుంది. ఎవరైతే బియ్యం వద్దనుకుంటారో వారి వివరాలు నమోదు చేసుకుని వారికి బియ్యానికి బదులుగా నగదు ఇచ్చేందుకు సిద్ధమైంది. కిలో బియ్యానికి రూ. 12 నుంచి 15 ల వరకు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. దీంతో బియ్యం అమ్ముకునే వారికి ఇక్కడే అడ్డుకట్ట వేయాలని ప్రణాళిక రచిస్తోంది.
Also Read: ఏపీ మంత్రి విడుదల రజినీ గురించి ఎవరికీ తెలియని విషయాలివీ!
ఈ నెల 18 నుంచి 22 వరకు వాలంటీర్లు ప్రజల నుంచి అంగీకార పత్రం తీసుకుని వీఆర్వోల పరిశీలన అనంతరం తహసీల్దార్ ఆమోదానికి పంపించి అక్కడ పని అయిపోయాక ప్రతి నెల బియ్యానికి బదులు నగదు అందజేసేందుకు ఆమోదం లభిస్తుంది. దీంతో నెలనెల వినియోగదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే వినియోగదారుల ఖాతాలకే నగదు జమ చేసేలా చూడాలని వినతులు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
మళ్లీ బియ్యం తీసుకోవాలని అనిపిస్తే మళ్లీ వాలంటీర్లకే సమాచారం అందజేస్తే వారు మళ్లీ యథాతథంగా బియ్యం వచ్చేలా చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి బియ్యానికి బదులు నగదు పథకం విజయవంతమైతే రాష్ట్రమంతటా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డు దారులు ఇప్పటికే రూ. 8 నుంచి 10 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read: వైసీపీలో విజయసాయిరెడ్డికి తగ్గిన ప్రాధాన్యం.. అమరావతికి దూరంగా కీలక నేత
[…] […]