Samantha: రాజమౌళి దర్శకత్వంలో… డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా దెబ్బతో ఎప్పటికప్పుడు విడుదల తేదీని ప్రకటించడం.. వాయిదా వేయడం వంటివి జరుగుతూనే వస్తోంది. కాగా తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ గ్లింప్స్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. 40 సెకన్ల ఈ వీడియోలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉండబోతోందనే చూపించాడు రాజమౌళి.

ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు ఎన్నడూ చూడనంత గ్రాండ్ విజువల్స్‌తో ఆర్ఆర్ఆర్ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. అలానే యాక్షన్ సీక్వెన్స్‌లో రాజమౌళి మార్క్ కనిపిస్తోంది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పవచ్చు. డైలాగ్ లేకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ కళ్ళతోనే ఫుల్ ట్రీట్ ఇచ్చారు. వీడియో చివర్లో పులి పంజా విసురుతూ ఉండే సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. అయితే తాజాగా ఈ వీడియోపై నటి సమంత స్పందించారు.
ఇంస్టాగ్రామ్ వేదికగా తన అకౌంట్ లో స్టోరీ గా ఆర్‌ఆర్ గ్లింప్స్ ను పోస్ట్ చేసిన సామ్… వామ్మో అన్నట్టుగా ఉండే ఎమోజీని పోస్ట్ చేశారు. అలానే గుడ్ లార్డ్ అంటూ రాసుకొచ్చారు సమంత. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ దేశ వ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ గ్లింప్స్ తో అంచనాలు అందని రీతిలో జక్కన్న మ్యాజిక్ చేశాడని చెప్పాలి. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
