https://oktelugu.com/

Actress Urmila: ప్రముఖ నటి ఊర్మిళకు కరోనా వైరస్…

Actress Urmila: కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి  ఊర్మిళ కరోనా బారిన పడింది. ఈ మేరకు ఆమే ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం తెలిపింది. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లోపాజిటివ్‌ అని తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. ప్రస్తుతం నేను హోమ్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 04:55 PM IST
    Follow us on

    Actress Urmila: కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి  ఊర్మిళ కరోనా బారిన పడింది. ఈ మేరకు ఆమే ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం తెలిపింది. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లోపాజిటివ్‌ అని తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. ప్రస్తుతం నేను హోమ్‌ క్వారంటైన్‌లో క్షేమంగానే ఉన్నాను.

    ఇటీవల నన్ను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోండి. మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ రానుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది ఊర్మిళ.

    కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో షూటింగులతో చిత్ర పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోంది. అదేవిధంగా పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తారలు వరసగా కరోనా బారిన పడడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. మొన్న టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ కొవిడ్‌ బారిన పడగా, నిన్న బాలీవుడ్‌ బ్యూటీ నిషా రావల్‌కు కరోనా సోకింది. తాజాగా రంగీలా కొవిడ్‌ బాధితుల లిస్ట్ లో  చేరిపోయింది. ఈ మేరకు ‘రంగీలా బ్యూటీ’ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రజలందరూ కూడా మాస్క్ లు ధరించి, సానిటైజర్ లు ఉపయోగించాలని పలువురు పిలుపునిస్తున్నారు.