Actress Samantha: చైతు సామ్ విడాకుల అనంతరం ఎవరి లైఫ్ లో వారు బిజీగానే ఉన్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే సమంత విడాకుల అనంతరం కూడా తమ అభిమానులను పోస్టులతో అలరిస్తూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియా మిత్రులు సమంత ని దోషిగా నిలబెట్టినా… వాటన్నిటినని పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సమంత. అప్పుడప్పుడు సామ్ పోస్టులలో ఏదో తెలియని బాధ, ప్రశ్నించే తత్వం పోస్టుల ద్వారా ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది.

ఇటీవలే సమంత ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నా తర్వాత ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే ఓ సంస్థతో కలిసి ఇంటిని చక్క పెట్టుకుంటూ ముచ్చటించారు సామ్. ఈ ఆర్గనైజర్‌తో కలిసి మాట్లాడుతూ తన లైఫ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు సమంత.
ఈ అమ్మడు ఎప్పుడైనా మూడ్ సరిగ్గా లేనప్పుడు దాని నుంచి బయట రావడానికి కబోర్డ్‌లోని దుస్తులను తీసి మళ్లీ సర్దుకుంటానని బెడ్ రూమ్ లోనే ఎక్కువగా సమయం గడుపుతానని చెప్పింది. ఈ సందర్భంగా తన డ్రెస్సింగ్ రూమ్ కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు సమంత. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సమంత నటిస్తుంది. ఈ సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నారు సమంత. కాగా త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాలో సామ్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది.