https://oktelugu.com/

Mahindra XUV 3×0 : మహీంద్రా నుంచి XUV 3×0 రిలీజ్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే

ఇక XUV 3x0 ధర విషయానికొస్తే.. ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ రూ.15.49 లక్షలకు విక్రయించనున్నారు. మైలేజ్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా లీటర్ పెట్రోల్ కు 20.1 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 30, 2024 12:27 pm
    Mahindra Mahindra XUV 3x0

    Mahindra Mahindra XUV 3x0

    Follow us on

    Mahindra XUV 3×0 : SUV కార్లకు పెట్టింది పేరు మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ కంపెనీ నుంచి రిలీజ్ కాబోతున్న కార్ల కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహీంద్రా నుంచి XUV 3×0 రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 29న ఇది మార్కెట్లోకి రానే వచ్చింది. మహీంద్రా నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న XUV300కి ఇది ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. సరికొత్త అప్డేట్ తో పాటు ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ కారు వివరాలు ఇప్పటికే ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఆసలు ఈ కారు ఎలా ఉందంటే?

    మహీంద్రా XUV 3×0 లో రెండు ఇంజిన్లను అమర్చారు. ఇందులో ఒకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 109 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేయగా.. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. మరో ఇంజిన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో 115 బీహెచ్ పీ పవర్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు డ్రైవర్ డిస్ ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో అదనంగా లెవల్ 2 అడాస్, ఆకర్షిస్తుంది.

    మహీంద్రా కొత్త కారు అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంది. ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా ఆకర్షి్తుంది. ఈ కారు మొత్తం 7 రంగులను కలిగి ఉంది. ఇవి డ్యూయెల్ టోన్ పెయింట్ తో కూడుకొని ఉన్నాయి. వీటిలో ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, నెబ్యూలా బ్లూ, డూన్ డస్ట్, సిట్రిన్ ఎల్లో మోడళ్లలో లభ్యమవుతాయి. ఈ కారు మొత్తం 18 వేరియంట్లలో లభించనుంది.

    ఇక XUV 3×0 ధర విషయానికొస్తే.. ప్రారంభ ధర రూ.7.49 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ రూ.15.49 లక్షలకు విక్రయించనున్నారు. మైలేజ్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా లీటర్ పెట్రోల్ కు 20.1 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. 4.5 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్నిఅందుకోగలదు. ఎస్ యూవీ కారు కావాలనుకునేవారికి మహీంద్రా నుంచి అద్భుతమైన కారును తీసుకొచ్చారని కొందరు కారు ప్రియులు చర్చలు పెట్టుకుంటున్నారు.