spot_img
Homeఎంటర్టైన్మెంట్Venkatesh And Roja: వెంకటేశ్ తో రోజా అందుకే మాట్లాడటం లేదా?

Venkatesh And Roja: వెంకటేశ్ తో రోజా అందుకే మాట్లాడటం లేదా?

Venkatesh And Roja: సినిమాల్లో కొన్ని వింతలు జరుగుతుంటాయి. ఒకరు చేయాల్సిన సినిమాను మరొకరు చేయడం, ఒకరికి వచ్చిన అవకాశం మరొకరు తీసుకోవడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు సైతం చోటుచేసుకోవడం మామూలే. సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ మధ్య ఇలాంటి విభేదాలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను తాను తీయాలని ఎన్టీఆర్ అనుకుంటే కృష్ణ తీసేశారు దీంతో ఎన్టీఆర్ కు కోపం వచ్చిందట. అలాగే దానవీర శూర కర్ణ సినిమా తీసే సమయంలో కృష్ణ కురుక్షేత్రం తీశారట. ఇలా వారి మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపి కొన్నాళ్ల పాటు మాట్లాడుకోలేదట. అలాంటి సన్నివేశాలు సినిమాల్లో సాధారణం. సరిగ్గా ఇలాంటి వైరుద్ధమే వెంకటేశ్, రోజా మధ్య జరిగింది.

Venkatesh And Roja
Venkatesh And Roja

వెంకటేశ్ హీరోగా తాను హీరోయిన్ గా సెల్వమణి దర్శకత్వంలో చినరాయుడు తీయాలని రోజా అనుకున్నారట. కానీ ఆ ప్రాజెక్టు అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తరువాత విజయశాంతి హీరోయిన్ గా చినరాయుడు తీశారు. దీంతో రోజాకు కోపం వచ్చి తాను తీద్దామనుకున్న సినిమాను ఆమెతో ఎందుకు తీశావు అని వెంకటేశ్ ను కడిగేసిందట. తన ప్రమేయం ఏమి లేదు. దర్శక, నిర్మాతల ప్రోద్బలంతోనే తాను ఆ సినిమా చేయాల్సి వచ్చిందని వెంకటేశ్ చెప్పడంతో కాస్తంత శాంతించిన రోజా తరువాత పోకిరిరాజా సినిమా చేసింది. వెంకటేశ్ తో రోజా నటించిన సినిమా అదొక్కటే కావడం విశేషం.

Also Read: Sr NTR Is A Food Lover: ఎన్టీఆర్ మంచి బోజన ప్రియుడు.. ఆయన ఎక్కువగా తాగేది ఏంటో తెలుసా?

పోకిరి రాజా సినిమా కోసం ముంబైలో షూటింగ్ పెట్టారు. రోజాను పిలిపించారు. ఆమెను ఓ హోటల్ లో ఉంచారు. కానీ మూడు రోజులైనా ఆమెకు ఫోన్ చేసి షూటింగ్ కు రమ్మనకపోవడంతో ఆమె విసుగెత్తి ఇంటికొచ్చేసింది. తరువాత ఆమెను మళ్లీ ముంబై రప్పించి ఆమెకు సంబంధించిన సీన్లు పూర్తి చేశారట. అప్పటి నుంచి రోజా వెంకటేశ్ తో మాట్లాడటం లేదు. ఇదంతా జరిగి పాతికేళ్లవుతోంది. అయినా వారి మధ్య మాటలు ఇప్పటివరకు కూడా లేవట. మొత్తానికి చేయని తప్పుకు వెంకటేశ్ ను రోజా బలిపశువును చేసినట్లు తెలుస్తోంది. ఆయన తప్పు లేకపోయినా మాటలు కట్ చేయడంతో ఎడమొహం పెడ మొహంగానే ఉంటున్నట్లు సమాచారం. సినిమాల్లో జీవితాల్లో లాగా నిజ జీవితంలో కూడా చేయని తప్పులకు శిక్షలు వేస్తారా? అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Venkatesh And Roja
Venkatesh And Roja

చేయని తప్పుకు వెంకటేశ్ పై రోజా కోపం పెంచుకోవడం మంచిదికాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. తను కూడా ఓ నటుడే కదా. ఆయనకు ఏం అధికారం ఉంటుంది. సినిమా మొత్తం దర్శక నిర్మాతల చేతుల్లోనే కదా ఉండేది. దీంతో రోజా వెంకటేశ్ పై అకారణంగా ద్వేషం పెంచుకుని ఇరవై ఐదు ఏళ్లుగా మాట్లాడకుండా ఏం సాధించినట్లు? ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అంతమాత్రం చేత వారిలో లోపాలు వెతుక్కుని మరీ పక్కన పెట్టేయడం సబబు కాదనేది అందరి వాదన. ఇప్పటికైనా రోజా వెంకటేశ్ చక్కగా మాట్లాడుకుంటూ స్నేహితుల్లా కలిసి ఉండాలనేదే అందరి ఆకాంక్ష.

Also Read:Ashu Reddy: అషు రెడ్డి వీడియో పై ట్రోల్స్.. ఆ కామెంట్స్ దారుణం !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version