Kaivalya Reddy Meets Lokesh: టీడీపీ వైపు ఆనం రామనారాయణరెడ్డి చూపు? లోకేష్ తో కుమార్తె కైవల్యారెడ్డి భేటీ

Kaivalya Reddy Meets Lokesh: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ గూటికి చేరనున్నారా? వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయన నిర్ణయం తీసుకున్నారా? మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో ఆయన మనసు సైకిల్ వైపు మళ్లిందా? అదును చూసి జగన్ కు దెబ్బకొట్టాలని చూస్తున్నారా? అందులో భాగంగానే ముందుగా కుటుంబసభ్యులను టీడీపీ గూటికి చేరుస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ మహానాడులో ఆసక్తికర […]

Written By: Dharma, Updated On : May 29, 2022 8:54 am
Follow us on

Kaivalya Reddy Meets Lokesh: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ గూటికి చేరనున్నారా? వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయన నిర్ణయం తీసుకున్నారా? మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో ఆయన మనసు సైకిల్ వైపు మళ్లిందా? అదును చూసి జగన్ కు దెబ్బకొట్టాలని చూస్తున్నారా? అందులో భాగంగానే ముందుగా కుటుంబసభ్యులను టీడీపీ గూటికి చేరుస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ మహానాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. శనివారం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్‌కు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

Kaivalya Reddy, Lokesh

లోకేష్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీడీపీ కండువా కప్పుకోవాలని కైవల్యారెడ్డి భావిస్తున్నట్లు తెలియవచ్చింది.కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకురాలు విజయమ్మకు కైవల్యారెడ్డి కోడలు. విజయమ్మ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే కోడలిని కూడా పార్టీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. మరి ఆత్మకూరు విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: TDP Mahaanadu: జగన్ ను ఓడించి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగలడా?

ఇదే హాట్ టాపిక్..
తాజాగా మారిన రాజకీయ పరిణామాలు, వీరి ప్రత్యేక భేటీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో, ఇటు వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కేబినెట్‌లో విస్తరణలో రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయనకు పదవి దక్కలేదు కానీ.. అదే సామాజిక వర్గానికి, అదే జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో అప్పట్నుంచి ఆనం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆయన కుమార్తె టీడీపీ మహానాడులో ప్రత్యక్షమవ్వడం, పైగా లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం పలు చర్చలకు దారితీసింది. అయితే ఈ విషయం తెలియగానే వైసీపీ అధిష్టానం నుంచి ఆనంకు ఫోన్ కాల్ కూడా వెళ్లిందని సమాచారం. ఈ భేటీపై ఇంతవరకూ ఆనం కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. కాగా వైసీపీలోకి రాకమునపు ఆనం కుటుంబం టీడీపీలోనే ఉండేది. ఈ కుటుంబం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు.

కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా..
ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నాయకుడు. వైఎస్ కేబినెట్ లో కీలక మంత్రి పదవులు చేపట్టారు. వైఎస్ కూడా రామనారాయణరెడ్డికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. గడిచిన 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. మంత్రివర్గ స్థానంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ జగన్ హ్యాండిచ్చారు. అప్పటి నుంచి అడపదడపా అసంత్రుప్తి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయనకు చోటు దక్కలేదు. ఆయన సమకాలీకులైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారికి మంత్రి పదవులిచ్చిన జగన్ ఆనం రామనారాయణ రెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అనూహ్యంగా ఆయన కుమార్తె తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు తెలియకుండా కుమార్తె రావడం జరగని పని అని.. ఆయన చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందన్న అనుమానాలు అధికార, విపక్ష పార్టీలో ప్రారంభమయ్యాయి.

YCP MLA anam, Kaivalya Reddy

వీడని సస్పెన్స్
ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు ఉపఎన్నిక జరుగుతోంది. ఈ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. జూన్‌ 6న నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్‌ 23న పోలింగ్‌, 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా.. గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్‌రెడ్డిని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉప ఎన్నికలో పోటీ విషయంలో టీడీపీ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఆత్మకూరులో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయత్వం ఇది వరకే ప్రకటించింది. మేకపాటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికలో పోటీ చేసి తీరుతానని మర్రిపాడు మండలానికి చెందిన బిజివేముల రవీంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Also Read:Sr NTR Is A Food Lover: ఎన్టీఆర్ మంచి బోజన ప్రియుడు.. ఆయన ఎక్కువగా తాగేది ఏంటో తెలుసా?

Tags