https://oktelugu.com/

Renu Desai: రేణు దేశాయ్ గుండె బద్దలైంది.. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలంటూ సంచలన పోస్ట్

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె హృదయం గాయపడింది. తన వేదన వెళ్లగక్కుతూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఇంతకీ రేణు దేశాయ్ మనసును బాధించిన ఆ అంశం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 25, 2024 / 08:24 AM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ తరచుగా వార్తల్లో ఉంటారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ అందుకు కారణం అవుతూ ఉంటాయి. ముక్కుసూటిగా ఉండే రేణు దేశాయ్ ఓపెన్ గా తన మనసులోని భావాలు పంచుకుంటుంది. రేణు దేశాయ్ కి ఆధ్యాత్మికత ఎక్కువ. ఆమె సనాతన ధర్మాన్ని నమ్ముతారు. దాన్ని కాపాడాలని అంటారు. అందుకు తన వంతు కృషి కూడా చేస్తుంది. అలాగే జీవ హింసకు రేణు దేశాయ్ వ్యతిరేకం. మూగజీవాలను ఏ రూపంలో బాధించినా ఆమె సహించరు. మాంసాహారం ముట్టరు. అందరూ శాఖాహారులు కావాలని కోరుకుంటారు.

    తాజాగా ఓ ఘటన ఆమెను బాధించింది. ఒక కుక్కపిల్లను కనికరం లేకుండా ఓ వ్యక్తి కాలితో తన్నడంతో ఆమె హర్ట్ అయ్యింది. తన అసహనం, ఆవేదన వెళ్లగక్కుతూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. కుక్క పిల్లతో కనికరం లేకుండా ప్రవర్తించిన వ్యక్తి వీడియో షేర్ చేసింది. కుక్కపిల్లను కాలితో తన్నడంతో దాని తల్లి పరుగున వచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి వాళ్ళను అసలు ఏం చేయాలని, రేణు దేశాయ్ ఆ వీడియో కి కామెంట్ జోడించింది.

    డాగ్స్, క్యాట్స్ కొరకు రేణు దేశాయ్ ఒక షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్ హోమ్ తన పిల్లలు అకీరా, ఆద్యల పేరిట ఏర్పాటు చేయడం విశేషం. ఇక రేణు దేశాయ్ కెరీర్ పరిశీలిస్తే.. ఆమె చాలా గ్యాప్ అనంతరం టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ నిజ జీవిత పాత్ర చేశారు. సోషల్ యాక్టివిస్ట్ హేమలత లవణం రోల్ చేసింది. డీ గ్లామర్ రోల్ లో ఆమె ఆకట్టుకున్నారు.

    టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆడలేదు. నటిగా కొనసాగాలని ఆమె ఆశపడుతున్నారు. మరోవైపు అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం కావాలనేది పూర్తిగా అకీరా నిర్ణయం అని రేణు దేశాయ్ అన్నారు. అకీరాకు ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ వంటి ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ఓ షార్ట్ ఫిల్మ్ కి అకీరా మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు ఆయన డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నారు. కాబట్టి అకీరా ఎంట్రీకి పెద్దగా సమయం లేదనే వాదన ఉంది.