https://oktelugu.com/

Murali Mohan: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: నా మంచితనం చూసి శ్రీదేవితో పెళ్లి చేస్తా అన్నారు

సినిమాల్లో నేను నటిస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అలాగే చూస్తుండిపోయేవారు. నేను సెట్ లోకి వస్తున్నప్పుడు, తిరిగి వెళుతున్నప్పుడు తీక్షణంగా గమనించేవారు. " బాగుందయ్యా నీ వాలకం..

Written By:
  • Rocky
  • , Updated On : June 23, 2023 / 11:24 AM IST

    Murali Mohan

    Follow us on

    Murali Mohan: మాగుంట మురళీమోహన్.. అలియాస్ జయభేరి కంపెనీ ఓనర్.. 84 సంవత్సరాల వయసు ఉన్న ఈ సీనియర్ నటుడికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. రకరకాల అవ లక్షణాలు ఉండే చిత్ర సీమలో ఇతడికి క్లీన్ ఇమేజ్ ఉంది. సినిమాలు మాత్రమే కాదు స్థిరాస్తి వ్యాపారం లోనూ భారీగా ఆస్తులు సంపాదించారు. దివంగత నటుడు శోభన్ బాబు సూచనతో భారీగా భూములు కొని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో జయ భేరీ పేరుతో ఏకంగా భారీ గృహ సముదాయం నిర్మించారు.. అటువంటి ఈ నటుడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన ఛానల్ ఏబీఎన్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

    ఎవరితోనూ సంబంధాలు లేవు

    “సినిమా పరిశ్రమ అంటేనే రకరకాల అవ లక్షణాలు ఉంటాయి. నేను కళా రంగం మీద ప్రేమతోనే సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేశాను. ఆ తర్వాత నిలదొక్కుకున్నాను. హీరోగా చాలా సినిమాల చేశాను. గుర్తుండిపోయే పాత్రలు వేశాను. హీరోగా నేను ఫేడ్ అవుట్ అయిన తర్వాత సహాయ పాత్రలు కూడా వేశాను. ఇక నన్ను జనం చూడరు అనుకుంటున్న తరుణంలో బయటకు వచ్చేసాను. అతడు సినిమా నిర్మించేటప్పుడు కొన్ని కారణాలవల్ల ఇక మళ్లీ సినిమాలు నిర్మించొద్దు అనుకున్నాను. అలాగే చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ కెరియర్లో ఎవరితోనూ సంబంధాలు లేవు. బుద్ధిమంతుడు లాగానే ఉన్నాను.

    నాగేశ్వరరావు మెచ్చుకున్నారు

    సినిమాల్లో నేను నటిస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అలాగే చూస్తుండిపోయేవారు. నేను సెట్ లోకి వస్తున్నప్పుడు, తిరిగి వెళుతున్నప్పుడు తీక్షణంగా గమనించేవారు. ” బాగుందయ్యా నీ వాలకం.. సినిమాల్లో నీలాంటి రామచంద్రుడి నటుడుని చూడలేదు. అలాగే ఉండు” అంటూ కితాబు ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా నాకు కిక్ ఇస్తుంది. ఇక నాగేశ్వరరావు మాటలతో నేను ఇంకా నా వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకున్నాను. సినిమాల్లో ఆజాతశత్రువుగా పేరు పొందాను.

    శ్రీదేవితో పెళ్లి చేయాలనుకున్నారు

    నా వ్యక్తిత్వం చూసి, గుణగణాలు చూసి చాలామంది హీరోయిన్లు ప్రపోజ్ చేశారు. కానీ అందరికీ నేను నో చెప్పాను. అప్పటికే పెళ్లి కావడం వల్ల నేను తప్పటడుగులు వేయలేదు. ఒకానొక సందర్భంలో నా వ్యక్తిత్వం చూసి శ్రీదేవి అమ్మగారు నన్ను చూసి ముషటపడ్డారు. శ్రీదేవితో నా పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ నాకు వివాహం జరిగింది అని తెలుసుకొని వెనకడుగు వేశారు. అప్పట్లో “యవ్వనం కాటేసింది” అనే సినిమాలో జయచిత్ర తో నటించాల్సి వచ్చింది. అది కొంత రొమాంటిక్ టచ్ ఉండే సినిమా. ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. అందులో నటించినందుకు జయచిత్రతో నాకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. తర్వాత అవి గాలికి కొట్టుకుపోయే పేలపిండి లాగా అయిపోయాయి.

    అలా చూస్తే బాధనిపించింది

    గ తేడాది చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద నటులు విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ముందు మోకరిల్లారు. సినిమా టికెట్ల ధర పెంచాలని కోరారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదు. చివరికి నంది అవార్డులు కూడా పక్కన పెట్టేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. సినిమా నటులు రాజకీయాలు చేయడం లేదు కదా? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కోపమో అర్థం కాదు” అంటూ మురళీమోహన్ ఆర్కే సంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలుగా చెప్పారు. మధ్యమధ్యలో ఆర్కే కొన్ని కౌంటర్లు ఇవ్వగా మురళీమోహన్ నవ్వును ఆశ్రయించారు. ఇద్దరి మధ్య చనువు ఉండడం వల్ల ఇంటర్వ్యూ కూడా బాగా వచ్చినట్లు కనిపిస్తోంది. మురళి మోహన్ ను ఆర్కే ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగారో? ఆయన ఏమేం సమాధానం చెప్పారో? ఆదివారం రాత్రి 8:30కు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు.