Actress Radha: ఒకప్పటి అగ్ర కథానాయకులైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ష, నాగార్జున, ఇలా ఆమె అందరితో ఆడిపాడింది. ఆమెను చూడడానికి ప్రేక్షకులు కూడా థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు. అది ఆమె గతం.. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. అందాల ‘రాధ’. వెండితెర పై ఆ రోజుల్లో.. అనగా ఇరవై ఐదేళ్ల క్రితం.. ఆమె తన అందంతోనూ, అభినయంతోనూ అద్భుతంగా మెప్పించింది.
అయితే, ఈ సీనియర్ హీరోయిన్ ఓ టీవీ ఛానెల్ లో సూపర్ క్వీన్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ఓ రియాలిటీ షోకు రాధ జడ్ట్ గా వ్యవహరించింది. ఆమె ఇలా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు ఆమె అభిమానులు చాలా సంతోష పడ్డారు. మొత్తానికి రాధ జడ్జ్ గా చేసిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.
ఇక రాధ సహ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నకుల్ కూడా చక్కగా ఆమెకు సపోర్ట్ ఇచ్చాడు. అందుకే ఈ కాంబినేషన్ లో మరో షో కూడా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది. మరో రియాలిటీ షోకు జడ్ట్ గా మారబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాధ చెబుతుంది. కచ్చితంగా ఈ షోలో ఆమె ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదిస్తాను’ అంటూ రాధ చెప్పుకొచ్చింది.
Also Read: Telugu Hit Movies: బాక్సాఫీస్ : ఎంత గొప్ప విజయమైనా మూన్నాళ్ళ ముచ్చటే
ఎప్పుడో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధ, ఇప్పుడు ఇలా ఒక రియాలిటీ షోకు జడ్ట్ గా మళ్ళీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడం తో ప్రేక్షకులు కూడా ఈ షో పై ఆసక్తి చూపిస్తున్నారు. రాధ అభిమానులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశమే.
Also Read: Varun Tej Ghani Movie: ‘వైల్డ్ ఫైట్స్ – యాక్షన్ ఎలిమెంట్స్’ మధ్యలో మెగా ప్రిన్స్
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More