Mekapati Younger Brother: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల వాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు స్థానం ఖాళీ అయింది. దీంతో త్వరలో నిర్వహించే రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇక్కడ కూడా ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వివరాలు పంపింది. దీంతో ఎన్నికల సంఘం సూచించిన దాని ప్రకారం ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వారి వారసులు వస్తే ఇతర పార్టీలు పోటీకి దూరం ఉండటం తెలిసిందే. అయితే గతంలో జరిగిన బద్వేల్ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పోటీకి దిగడంతో ఇక్కడ కూడా అదే పద్ధతి పాటిస్తారా? లేక పోటీకి దూరంగా ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. తిరుపతి, నంద్యాలలో కూడా పోటీ లేదు. దీంతో ప్రస్తుతం ఆత్మకూరులో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
మరోవైపు మేకపాటి బంధువునంటూ బిజువేముల రవీంద్రరెడ్డి అనే వ్యక్తి పోటీకి సిద్ధమని ప్రకటించడంతో అందరి దృష్టి ఆయన మీదే పడింది. ఆయన స్వయానా మేకపాటి రాజమోహన్ రెడ్డికి మేనల్లుడు కావడం విశేషం. దీంతో ఆత్మకూరులో ఏం జరుగుతుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రవీంద్ర రెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉంటారనే వార్తలు వస్తున్నాయి. దీనికి ఇంకా బీజేపీ ఏం నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ బీజేపీకి పోటీకి దూరంగా ఉంటే స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు.
Also Read: పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఇవాళే చివరి అవకాశం?
మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారని రాజమోహన్ రెడ్డి జగన్ కు తెలపడంతో జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పోటీకి టీడీపీ, జనసేన దూరం ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రవీంద్ర రెడ్డి స్వతంత్రంగా పోటీలో ఉంటారా? లేక బీజేపీ తరఫున బరిలో నిలుస్తారా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై రవీంద్ర రెడ్డిని పోటీకి దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
మరోసారి ఆత్మకూరు రాజకీయ వేదికగా మారనుందా? లేక ఏకగ్రీవంగా కానుందా? అని అందరిలో ఉత్కంఠ కలుగుతోంది. అయితే ఆత్మకూరులో అభ్యర్థుల్లో పోటీ ఉంటుందా? ఏకగ్రీవానికి పెద్దపీట వేస్తారా? అనే సంశయాలు ఓటర్లలో వస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో పార్టీలు ఏమేరకు ప్రవర్తిస్తాయో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
[…] Also Read: ఆత్మకూరు లో మేకపాటి తమ్ముడే అభ్యర్థయ… […]
[…] Also Read: ఆత్మకూరు లో మేకపాటి తమ్ముడే అభ్యర్థయ… […]