https://oktelugu.com/

Payal Ghosh: నువ్వు ఆ పని చేస్తానంటే నేను పెళ్లి చేసుకుంటా.. షమీకి బోల్డ్ ఆఫర్ ఇచ్చిన హీరోయిన్…

ఇండియన్ టీం లో అత్యంత కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ వరల్డ్ కప్ లో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఆయన వరల్డ్ కప్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో 16 వికెట్లు తీసి తనదైన మార్క్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్స్ ని భయపెడుతున్నాడనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2023 / 11:45 AM IST

    Payal Ghosh

    Follow us on

    Payal Ghosh: గ్రౌండ్ లో ఫైర్ మీద ఉన్న బ్యాట్స్ మెన్ ని కట్టడి చేయాలంటే బౌలర్ దగ్గర బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించే తెలివి ఉండాలి…వేసిన ప్రతి బాల్ ను కూడా ఎదుర్కోవడానికి బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడేలా ఉండాలి,బుల్లెట్ వేగంతో వేయకపోయిన వేసిన బంతి మాత్రం బ్యాట్స్ మెన్ బౌల్డ్ అయ్యేలా ఉండాలి,ఈ బౌలర్ బౌలింగ్ లో షాట్స్ ఆడాలి అంటే బ్యాట్స్ మెన్ భయపడేలా ఉండాలి.అలాంటి బౌలర్ టీమ్ లో ఉంటే టీమ్ కి దైర్యం వస్తుంది గెలవాలనే కసి పెరుగుతుంది ఫలితం గా మ్యాచ్ లో గెలుపు దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది…ఇక అలాంటి లెక్కలతో ఇండియన్ టీమ్ లో ఒక బౌలర్ ఉన్నాడు.వాడు వేసే బంతి వేగం గాలి కంటే స్పీడ్ గా ఉంటుంది,వాడి లైన్ అండ్ లెంగ్త్ బ్యాట్స్ మెన్ భయపడేలా ఉంటుంది.మంచి నీళ్ళు తాగినంత ఈజీగా వికెట్లు తీస్తాడు. అతనే ఇండియన్ పేస్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ…

    ఇండియన్ టీం లో అత్యంత కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ వరల్డ్ కప్ లో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఆయన వరల్డ్ కప్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో 16 వికెట్లు తీసి తనదైన మార్క్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్స్ ని భయపెడుతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి షమీ తన పేస్ బౌలింగ్ లో ప్రత్యర్థి బౌలర్లు ఎంత మాత్రం ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ప్రతి బాల్ కి వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడంలో తను కీలక పాత్ర వహిస్తున్నాడు. షమీ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం వల్లే ఇండియన్ టీమ్ ప్రతి మ్యాచ్ లో గెలుస్తూ వస్తుంది.

    ఇండియన్ టీమ్ ని ప్రతి మ్యాచ్ లో గెలిపించే దిశగా ముందుకు తీసుకెళుతున్న షమీ ఈసారి ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈ సమయంలో పాయల్ ఘోష్ అనే ఒక నటి మహమ్మద్ షమీ పైన ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. షమీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా నేర్చుకో అంటూ ఒక ట్వీట్ చేసింది. దాన్ని షమీ పట్టించుకోలేదు కానీ అది చూసిన ఇండియన్ క్రికెట్ అభిమానులు మరియు నార్మల్ జనాలు అందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇంగ్లీష్ కి సంబంధం ఏంటి ? నీకు తను నచ్చితే పెళ్లి చేసుకో అంతేగాని ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటా అనడం కరెక్ట్ కాదు అలా చేసుకోవాలంటే ఇంగ్లీష్ టీచర్ చేసుకో అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.ఇక అదే విధంగా మరికొందరు మాత్రం పాయాల్ ఘోష్ ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని నువ్వు షమీ ని ఎగతాళి చేస్తున్నావ్. అయిన అతను ఎంత మంచి ప్లేయరు ముందు అతని టాలెంట్ ని గుర్తించు అంతే కానీ అతని భాష ని కాదు అంటూ చాలా మంది ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఆమె ట్వీట్ పట్ల అలాగే పాయాల్ ఘోష్ పైన విరుచుకు పడుతున్నారు…

    ఇక ఇండియా 15వ తేదీన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న క్రమంలో ఇండియన్ ప్లేయర్లందరూ కూడా దానికి సంబంధించి మనం ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అని దానిపైన తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మధ్యలో నెదర్లాండ్స్ పైన ఈ లీగ్ లో ఇండియన్ టీమ్ తన చివర మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ అది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు కాబట్టి ప్లేయర్లు కొంచెం రిలాక్స్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే సెమీ ఫైనల్ లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడానికి షమీ తన వ్యూహాలను రెఢీ చేసుకుంటున్నాడు…