Samantha-Kajal: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లిస్ట్ లో ఉంటారు సమంత, కాజల్. ఈ ఇద్దరు కూడా కష్టపడి పైకి వచ్చారు. ఈగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఎన్నో హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ లను సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో కూడా హిట్ లు ఎక్కువ ఫ్లాప్ లు చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా బృందావనం. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
వంశీ పైడిపల్లి దర్వకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్ అవడంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ లు ఉంటాయని తెలిసిందే. ఎన్టీఆర్ మొదట సమంతను ప్రేమిస్తారు. ఆ తర్వాత కాజల్ కు అట్రాక్ట్ అవుతారు. కాజల్ కూడా ఎన్టీఆర్ ను ప్రేమిస్తుంది. చివరగా సమంత, కాజల్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవాలని చూస్తారు. ఇక ఎన్టీఆర్ కూడా ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక డైలమాలో ఉంటాడు. చివరికి ప్రేక్షకులు కూడా అవును ఎన్టీఆర్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
పెళ్లి అనే ప్రశ్నకు డైరెక్టర్ కూడా సమాధానం చెప్పలేకపోతాడు. సమంతతో పెళ్లి చేస్తే కాజల్ ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. కాజల్ తో పెళ్లి చేస్తే సమంత ఫ్యాన్స్ హట్ అవుతారు. అందుకే క్లారిటీ ఇవ్వకుండా అలాగే వదిలేస్తాడు డైరెక్టర్. ఇక ఈ సీన్ చేసేటప్పుడు కాజల్, సమంత నాకు సూట్ అవుతాడంటే నాకు సూట్ అవుతాడు అని ఫన్నీగా గొడవ పెట్టుకున్నారట. అందుకే ఎవరికి ఈ విషయంలో లీడ్ ఇవ్వకుండా వంశీ పైడిపల్లి సేఫ్ జోన్ లోకి వెళ్లారు. సినిమా చివరలో కోటా శ్రీనివాస్ మనవడా అని ఇద్దరు భార్యలు ఉన్న దేవుడిని చూపించడంతో సినిమా ఎండ్ అవుతుంది. మొత్తం మీద సినిమా మాత్రం సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.